ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తాం; కాంగ్రెస్

159

ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేయాలని కాంగ్రెస్ నిర్ణయం నిర్ణయించింది. పొత్తులు లేకుండా 175 స్థానాల్లో పోటీచేస్తున్నట్టు ఏపీ పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి ప్రకటించారు.కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీని ప్రధాని చేయడమే లక్ష్యంగా తమ కార్యాచరణ ఉంటుందన్నారు. ఐదు కోట్ల ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మేలు జరగాలంటే హస్తం గుర్తుకే ఓటెయ్యాలన్నారు.వేరే ఎవరికి ఓటు వేసినా.. నష్టమని.. వేరేవాళ్లకు ఓట్లు వేస్తే… వారికి మాత్రమే ప్రయోజనమన్నారు.ఇది ఏఐసీసీ తీసుకున్న నిర్ణయమని.. ఏపీ ఇంఛార్జి ఉమెన్ చాందీ ద్వారా తమకు తెలియజేశారని రఘువీరా తెలిపారు. టీడీపీతో అవగాహన జాతీయ రాజకీయాలకు మాత్రమే పరిమితమని తెలిపారు. ఈ నెల 31న అన్ని నియోజకవర్గాల నాయకులతో సమావేశం నిర్వహించి.. భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. ఫిబ్రవరి ఒకటి నుంచి ఎన్నికలే లక్ష్యంగా పనిచేస్తామన్నారు. ఐదు కోట్ల ప్రజల భవిష్యత్తుకు ముడిపడి ఉన్న అంశం ఇది అని తెలిపారు. ప్రియాంక గాంధీని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శిగా నియమించడం పట్ల రఘువీరా హర్షం వ్యక్తం చేశారు. ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న శుభవార్త అన్నారు.ఈ సందర్భంగా రాహుల్ గాంధీకి కృతజ్ఞతలు తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here