ఏపీలో కుల ధృవీకరణ పత్రం ఇక కష్టమే..!

98

మీసేవ కేంద్రాల ద్వారా మంజూరవుతున్న కుల ధ్రువీకరణ పత్రాల్లో ఇకనుంచి చాలా జా ప్యం చోటుచేసుకోనుంది. గతంలోలా దరఖాస్తులు చేసుకున్న ఒకటిరెండు రోజుల్లో తహసీల్దార్‌ కార్యాలయాలకు వెళ్లి ధ్రువత్రాలు తీసుకోవచ్చని భావించే వారికి నిరాశ తప్పదు. ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి బుధవారం మం డల రెవెన్యూ కార్యాలయాలకు ఈమేరకు మా ర్పులు చేస్తూ ఉత్తర్వులు అందాయి. పాత నిబంధనలనే పక్కగా అమలుతోపాటు సాంకేతిక ప్రాధాన్యతకు సీఎంఓ కార్యాలయం ముడిపెట్టిం ది. నిబంధనల ప్రకారం కుల, ఆదాయ ధ్రువీకరణ పొందేటప్పుడు గ్రామ రెవెన్యూ అధికారుల పరిశీలించాలి.

కొత్తగా కుల ధ్రువీకరణ పత్రం జారీకి 30 రోజులు, ఆదాయ , నివాస ధ్రువపత్రాలకు వారం రోజులు గడువు విధించారు. ప్రస్తుతం విద్యా, ఉద్యోగ అవసరాలకు వినియోగించే ఈ ధ్రువపత్రాల మంజూరుకు అధికారులు ఇంత సమయం తీసుకోవడం లేదు. వా రం రోజుల లోపు ఈపత్రాలను అందిస్తున్నారు. కాస్తా పలుకుబడి కలిగిన వారికి ఒకట్రెండు రోజుల్లోనే చేతికి అందుతోంది. కొత్తగా ఆదాయ ధ్రువ పత్రం జారీలో ప్రభుత్వం కొన్ని పరిమితులు విధించింది. రేషన్‌ కార్డును ప్రామాణికంగా చూపించే అవకాశం కల్పించింది. ప్రభు త్వ, ప్రైవేటు సంస్థలు తప్పకుండా ఆదాయ ధ్రువపత్రం సమర్పించాలి.అలాగే కంప్యూటర్‌లో ఎవరు ముందు ఆదాయ ధ్రువపత్రానికి దరఖాస్తు చేసుకుంటే వారికే తొలి ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉంటోంది. మిగిలిన వారివి వరుస క్రమంలో జారీ అవుతాయి.

ఇప్పుడు కుల దృవీకరణ పత్రం జారీకు సీఎంఓ కార్యాలయం చేసిన సూచనల ప్రకారం మీసేవలో చేసుకున్న దరఖా స్తు ప్రతులు సక్రమంగా ఉన్నదీ లేనిది వీఆర్‌వో తప్పనిసరిగా పరిశీలించాలి. పక్కాగా క్షేత్రస్థాయిలో కుల గుర్తింపుపై ఆరా తీయాలి. విపులంగా తయారు చేసిన నివేదికను వీఆర్‌వో ఆండ్రాయిడ్‌ ట్యాబ్‌ లాగిన్‌లో స్కాన్‌ చేయాలి. ఈ ట్యాబ్‌లో పొందుపరిచిన నివేదికను రెవె న్యూ ఇన్‌స్పెక్టర్‌కు ఫార్వర్డ్‌ చేయాలి. వీఆర్‌వో పంపించిన చెక్‌ స్లీప్‌ను ఆర్‌ఐ చెక్‌ చేయాలి. అన్ని సక్రమంగా ఉంటే నివేదికను తయారు చేసి ఉప తహసీల్దార్‌కు ఫార్వర్డ్‌ చేయాలి. ఇత ను నిర్థారించిన మీదట తహసీల్దార్‌ సంతకంనకు పంపాలి. ఈ మొత్తం పక్రియంతా ఆన్‌లైన్‌లో జరపాలి. ఈమేరకు సాఫ్ట్‌వేర్‌లో వీఆర్‌వో , ఆర్‌ఐ మ్యాప్‌ యాప్‌ను నిక్షిప్తం చేశారు. యూజర్‌నేమ్‌, పాస్‌వర్డ్‌లను క్రియేట్‌ చేశారు. దీంతో ఇప్పుడు ప్రతి అధికారి సంతకంతో నివేదిక త యారు జరిగిన తరువాతే కులధ్రువీకరణ పత్రం జారీకి వీలవుతుంది.

 

అత్యవసరంగా అయితే వీలుకాదు..

ఈ పక్రియంతా పూర్తయ్యేందుకు కనీసం పది రోజులు పడుతుంది. అత్యవసరంగా కావాలంటే కుదరదు. నెల రో జుల ముందు దరఖాస్తు చేసుకుంటేనే అవసరాలకు కుల ధ్రువీకరణ పత్రం పొందగలరు. సాధారణంగా కుల ధ్రువపత్రం కోసం మీ సే వలో దరఖాస్తు చేసుకున్న తరువాత రెవెన్యూ అధికారులు విచారించేందుకు నెల రోజులు గడువును ప్రభుత్వం విధించింది. పలు ఉద్యోగాలు క ల్పిస్తున్న సంస్థలు ఇంటర్వ్యూలకు పది రోజుల ముందు లేటెస్టు ధ్రువ పత్రాలు కావాలని అడుగుతున్నారు. ఆసమయంలో తీసుకోనే ధ్రువపత్రాలకు మాత్రమే చెల్లుబాటు కల్పిస్తున్నాయి. వారం పది రోజుల ముందు చెబుతున్నారు. తపాలా ఆలస్యం వంటి కారణాలతో మరి కొంత తక్కువ సమయం పడుతుంది.

ప్రస్తుతం సీఎంఓ తీసుకువచ్చిన మార్పుల ద్వారా కులధ్రువీకరణ ప త్రంనకు అవస్థలు పడే అవకాశం వుంది. దీనికి తోడు చాలా గ్రామ రెవెన్యూ అధికారులకు సాం కేతిక పరిజ్ఞానం ఉండటం లేదు. అడ్రాయిడ్‌ పోన్‌ వాడకం తెలియని వారు ఎంతో మంది ఉన్నారు. ఇలాంటి వారంతా ఈ పక్రియ నిర్వహించాలంటేచాలా సమయం పడుతుంది. అంత వరకు ఆయా గ్రామాల ప్రజలు కులధ్రువ పత్రాలకు ఎన్ని పాట్లు పడాలో అర్థంకావడం లేదని రెవెన్యూ వర్గాలే అంటున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here