ఏపీలో కాంగ్రెస్‌కు పట్టిన గతే బీజేపీకి పడుతుంది: లోకేష్‌

30

లోటు బడ్జెట్‌లో ఉన్న రాష్ట్రానికి నరేంద్రమోదీ న్యాయం చేస్తారనే నమ్మకంతో ముఖ్యమంత్రి చంద్రబాబు బీజేపీతో పొత్తు పెట్టుకున్నారని మంత్రి లోకేష్‌ పేర్కొన్నారు. రాష్ట్రానికి న్యాయం చేయకపోగా ఏపీకి బీజేపీ నమ్మకద్రోహం చేసిందని ఆయన తీవ్రస్థాయిలో విమర్శించారు. ఏపీలో కాంగ్రెస్‌కు పట్టిన గతే రేపు రాబోయే ఎన్నికల్లో బీజేపీకి పడుతుందని లోకేష్‌ జోస్యం చెప్పారు. ఏపీలో కనీసం 10 పంచాయతీలు కూడా బీజేపీ గెలవలేని పరిస్థితని ఆయన ఎద్దేవా చేశారు. రూ. 24వేల కోట్లు రుణమాఫీ చేసిన ఘనత చంద్రబాబుదని లోకేష్‌ కొనియాడారు. ఏపీలో విపక్షాలు కుట్ర రాజకీయాలు చేస్తున్నాయని మంత్రి మండిపడ్డారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here