ఏపీకి వస్తున్న డీపీ వరల్డ్ సంయుక్త కార్యబృందం!

ఆరు ఖండాలు, 40 దేశాల్లోని నౌకాశ్రయాల్లో మెరైన్, ఇన్‌లాండ్ టెర్మినళ్లను కలిగి, సప్లయ్ చైన్ ద్వారా అంతర్జాతీయ వాణిజ్యానికి మార్గం సుగమం చేయండంలో ముఖ్యపాత్ర పోషిస్తున్న డీపీ వరల్డ్‌,

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంయుక్త భాగస్వామ్యంతో కార్యబృందం ఏర్పాటైంది. సంయుక్త కార్య బృందంలో ఏపీ ప్రభుత్వ మౌలిక సదుపాయాల శాఖ ముఖ్యకార్యదర్శి అజయ్‌జైన్,

డీపీవరల్డ్ సీఈవో యువరాజ్ వున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టేందుకు, వివిధ అంశాలలో కలిసి పనిచేసేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గత

దుబాయ్ పర్యటనలోనే డీపీ వరల్డ్ సంసిద్ధత వ్యక్తం చేసింది. ఏపీలో తమ సంస్థ కార్యకలాపాల విస్తృతికి వెంటనే ఒక బృందాన్ని పంపిస్తామని ముఖ్యమంత్రి తాజా పర్యటనలో డీపీ వరల్డ్ చైర్మన్ సుల్తాన్ బిన్ సులేయామ్‌ వెల్లడించారు.

సోమవారం భారత్ వస్తున్న డీపీ వరల్డ్ ప్రతినిధి, ఏపీ అధికారుల బృందాన్ని కలుసుకుని చర్చించనున్నట్టు సులేయామ్ తెలిపారు.

ఏపీలో కనీసం మూడు చోట్ల లాజిస్టిక్ పార్కులను ఏర్పాటు చేయాలని, ఒక పారిశ్రామిక సెజ్ ఏర్పాటు అంశాన్ని పరిశీలించాలని సులేయామ్‌కు ముఖ్యమంత్రి సూచించారు.

మూడు నెలల్లో దీనిపై నిర్ణయం తీసుకోవాలని కోరారు. అలాగే విశాఖలో జరిగే సీఐఐ భాగస్వామ్య సదస్సులో పాల్గొనాలని సులేయామ్‌ను ముఖ్యమంత్రి ఆహ్వానించారు.

ఓడరేవులకు వస్తు సరఫరా చేసేందుకు భారత్ నౌకాశ్రయాలు ఎదుర్కొంటున్న ప్రధాన అడ్డంకులను ముందుగా తొలగించాలని, లాజిస్టిక్స్,

పారిశ్రామిక పార్కులను నిర్మించాల్సిన అవసరం వుందని ఈ సందర్భంగా సుల్తాన్ బీన్ సులేయామ్ ముఖ్యమంత్రితో అన్నారు.

ప్రపంచ వ్యాప్తంగా వున్న నౌకాశ్రయాలు అభివృద్ధి చెందాయంటే కేవలం ఈ సదుపాయాల కల్పన వల్లేనని జబల్ ఆలీ పోర్టును ఉదహరించారు.

ముఖ్యమంత్రితో భేటీలో డీపీ వరల్డ్ గ్రూపు డిప్యూటీ ఛీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ రాజ్‌జిత్ సింగ్ వాలియా, కార్పొరేట్ ఫైనాన్స్, బిజినెస్ డెవలప్‌మెంట్ వైస్ ప్రెసిడెంట్ గౌరవ్ ఖన్నా వున్నారు.

విశాఖ కన్వెన్షన్ సెంటర్‌ ఆకృతులు సిద్ధం
విశాఖ మహానగరంలో లులూ గ్రూపు ఏర్పాటు చేస్తున్న కన్వెన్షన్ సెంటర్‌కు సంబంధించిన నిర్మాణ ఆకృతులు సిద్ధమయ్యాయి.

వీటిని దుబాయ్ పర్యటనలో వున్న ముఖ్యమంత్రికి ఆ సంస్థ ప్రతినిధులు చూపించారు. మరోవైపు విశాఖలో ఈనెల 26న లులూ కన్వెన్షన్ సెంటర్ నిర్మాణానికి ముఖ్యమంత్రి శంకుస్థాపన చేసే అవకాశం వుంది.

ముఖ్యమంత్రి బృందంలో ఆర్ధిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు, ప్రభుత్వ సలహాదారు డాక్టర్ పరకాల ప్రభాకర్,

ముఖ్యమంత్రి ముఖ్య కార్యదర్శి జి. సాయిప్రసాద్, మౌలిక వసతుల శాఖ ముఖ్య కార్యదర్శి అజయ్ జైన్,
ఏపీఈడీబీ సీఈవో జాస్తి కృష్ణ కిషోర్ వున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *