ఏపీకి వచ్చేందుకు సిద్ధం: టాటాసన్స్ బోర్డు చైర్మన్

47

ఐటీ రంగంలోనే కాకుండా అనేక అంశాలలో ఆంధ్రప్రదేశ్‌కు వచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని టాటాసన్స్‌బోర్డు చైర్మన్ నటరాజన్‌ చంద్రశేఖరన్ తెలిపారు.

సింగరపూర్ పర్యటలో ఉన్న సీఎం చంద్రబాబు శుక్రవారం ఉదయం నటరాజన్‌తో సమావేశమయ్యారు.

ఏపీలో టీసీఎస్ కార్యకలాపాలు పెద్దఎత్తున చేపట్టాలని ఈ సందర్భంగా సీఎం వినతి చేశారు.

దీనిపై సానుకూలంగా స్పందించిన నటరాజన్ ఏపీకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు.

అలాగే ఆతిథ్యరంగంలో పెట్టుబడులు పెట్టేందుకు నటరాజన్ ఆసక్తి కనబర్చారు.

అంతేకాకుండా స్మార్ట్ సిటీల రూపకల్పనలో సహకరించేందుకు టాటా సన్స్ ముందుకు వచ్చింది.

అమరావతికి రావడానికి నటరాజన్ స్పష్టమైన ఆసక్తిని వ్యక్తం చేశారు.

అమరావతి కేంద్రంగా కార్యకలాపాలు కొనసాగించడానికి సిద్ధంగా ఉన్నట్లు పేర్కొన్నారు.

అమరావతిలో విద్యుత్ బస్సులు, కార్లు వంటి ఆధునిక రవాణా వ్యవస్థలో భాగస్వాములం అవుతామని ఆయన వెల్లడించారు.

ఏపీలో సంపూర్ణ కాలుష్యరహిత రవాణా వ్యవస్థ ఏర్పాటు చేస్తామని సీఎం తెలుపగా ఈ రంగంలో పెట్టుబడులకు ఎంతో ఆసక్తిగా ఉన్నామన్న నటరాజన్ చెప్పారు.

3 వారాల్లో అమరావతికి వస్తామని, హోటళ్లు, స్మార్ట్‌ సిటీస్, రవాణా వంటి అంశాలపై చర్చిస్తామని సీఎం చంద్రబాబుకు నటరాజన్ తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here