‘ఏపీకి కేంద్రం చేయూత’ బుక్‌లెట్‌‌ను ఆవిష్కరించిన హరిబాబు

40

‘ఏపీకి కేంద్రం చేయూత’ బుక్‌లెట్‌‌ను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు హరిబాబు ఆవిష్కరించారు.చంద్రబాబు అసెంబ్లీ వేదికగా బీజేపీపై లేనిపోని ఆరోపణలు చేశారని ఆయన మండిపడ్డారు.హోదా అడిగిన విపక్ష నేతలను విమర్శించిన చంద్రబాబు తర్వాత ఎందుకు యూ లర్న్ తీసుకున్నారో తెలియదని అన్నారు.హోదాతో వచ్చే ప్రయోజనాలను నిధుల రూపంలో రాష్ట్రానికి ఇస్తున్నామని హరిబాబు అన్నారు.హోదా వలన ఏపీకి వచ్చే ప్రయోజనం రూ. 15 నుంచి రూ.16 వేల కోట్లు అని తెలిపారు.ఇప్పటికే రూ. 9 వేల కోట్లు కేంద్రం ఇచ్చిందన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు ఏ రాష్ట్రానికీ హోదా ప్రకటించలేదన్నారు. ప్యాకేజీపై చంద్రబాబు అసెంబ్లీలో ధన్యవాద తీర్మానం చేసిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. హోదా అడిగిన విపక్ష పార్టీల నేతలను సీఎం విమర్శించారని హరిబాబు అన్నారు.ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు కామినేని, విష్ణుకుమార్ రాజు, ఎమ్మెల్సీ మాధవ్ తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here