ఆంధ్రప్రదేశ్ మెజార్టీ ఓటర్లు స్వార్ద పరులని, అవకాశవాదులని, వారి నమ్మకాలు ఎప్పుడెప్పుడు ఏ విధంగా మారతాయో వారికే తెలియదని, ఎవరిని నమ్మాలో, ఎవరిని ఆదరించాలో వారిని ఆదరించకుండా పాలకులను ఎన్నుకోవటంలోనూ ఏపి ప్రజల అభిప్రాయాలు మారిపోయాయని మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర పడ్నవీస్ ఒక తెలుగు ఐఎఎస్ అధికారిని కలిసిన సందర్భంలో వారి మాటల మధ్య తన అభిప్రాయాన్ని వెల్లడించినట్లు తెలిసింది.
తెలుగు ఐఎఎస్ అధికారితో మాట్లాడుతూ ఏపి ప్రజల నమ్మకాలు ఆదరాభిమానాలు ఎప్పుడు ఎలా మారతాయో..వారికే తెలియదు.. అభివృద్దిని పట్టించుకోరు అన్నారు.ఇక్కడ తెలుగు ప్రజలు చంద్రబాబును కుల, మతతత్వాలతో ఎన్నికలలో ఓడించారు.చివరకు విషయంలో కూడా మహారాష్ట్ర ప్రజలు, ఉత్తరాది ప్రజలు తిరుమల వెంకన్న స్వామికి దర్శించేందుకు అష్ట కష్టాలు పడి వస్తుంటారు. ఆయనను దర్శించుకుని తన్మయత్వంతో తిరిగి వెళ్లిపోతారు. వారిలో తక్కువ మంది మాత్రమే షిరిడి సాయిబాబాను దర్శిస్తారు. ఈరోజు టిటిడికి ఇంత ఆదాయం వస్తుందంటే అందులో 80శాతం పైగా తెలుగేతర ప్రజలు ఇస్తున్న కానుకలే… అదే విధంగా తిరుమల తిరుపతి దేవస్థానానికి వస్తున్న ఆదాయంలో కాని, విరాళంలోకానీ తెలుగు ప్రజల కన్నా తెలుగేతర ప్రజలే ఎక్కువగా విరాళాలు ఇస్తున్నారని టిటిడి అధికారులు చెబుతుంటారు.
భగవంతుడు విష్ణుమూర్తి మూలవిరాట్ రూపంలో తిరుమలలో వెలిస్తే ,తెలుగేతర ప్రజలకు వెంకటేశ్వరస్వామి అన్నా… తిరుమల కొండ అన్నా అపార నమ్మకం పవిత్ర భావంతో ఉంటారు. షిరిడీ సాయి బాబా దేవస్థానానికి వందల కోట్లు ఆదాయాలు లభిస్తున్నాయంటే అది ఆయనపై తెలుగు ప్రజలకున్న నమ్మకం. మహారాష్ట్రీయుల కన్నా తెలుగు ప్రజలు ఎక్కువగా దర్శించి కోట్లాది రూపాయలు కానుకలు ఇస్తుంటారని దేవస్థానం అధికారులు చెబుతుంటారు. తెలుగు ప్రజలు ప్రతి చిన్న విషయాన్ని భూతద్దంలో చూస్తుంటారు. నిజా నిజాలు తెలుసుకోరు. కుల,మతాలపై అనుకూలతతో, వాస్తవాలు తెలుసుకోకుండా నిర్ణయాలు తీసుకోవటంలో మిగతా రాష్ట్రాల ప్రజల కన్నా ఏపి ప్రజలు స్వార్దంతో ఆలోచిస్తారని మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర పడ్నవీస్ ఒక తెలుగు ఐఎఎస్ అధికారిని కలిసిన సందర్భంలో వారి మాటల మధ్య తన అభిప్రాయాన్ని వెల్లడించినట్లు తెలిసింది.