ఏఎన్‌సి, సప్తగిరి సత్రాల్లో  జెఈవో తనిఖీలు

5

తిరుమలలోని ఏఎన్‌సి ప్రాంతం, సప్తగిరి సత్రాలను జెఈవో శ్రీ కె.ఎస్‌.శ్రీనివాసరాజు మంగళవారం ఉదయం తనిఖీ చేసి శ్రీవారి సేవకులు అందిస్తున్న సేవలను పరిశీలించారు. ఆయా ప్రాంతాల్లోని రిసెప్షన్‌ కౌంటర్లలో నిర్వహిస్తున్న బాధ్యతలను శ్రీవారి సేవకులను అడిగి జెఈవో తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఇక్కడ విధులు నిర్వహిస్తున్న మెదక్‌, విశాఖపట్నం ప్రాంతాలకు చెందిన శ్రీవారి సేవకులు సమాధానమిస్తూ భక్తుల కుటుంబ సభ్యుల సంఖ్య, మొబైల్‌ నంబరు నమోదు చేసుకుని గది కేటాయిస్తున్నామని, ఖాళీ చేసిన అనంతరం పరిశీలిస్తున్నామని తెలియజేశారు. అనంతరం పలువురు భక్తులు, శ్రీవారి సేవకుల నుండి జెఈవో అభిప్రాయాలు సేకరించారు. రిసెప్షన్‌ కౌంటర్లలో కంప్యూటర్లు ఏర్పాటుచేసి భక్తుల వివరాలను నమోదు చేసేలా సేవకులకు శిక్షణ ఇవ్వాలని సంబంధిత అధికారులకు జెఈవో సూచించారు. జెఈవో వెంట టిటిడి ఎస్‌ఇ-2 శ్రీ రామచంద్రారెడ్డి, డెప్యూటీ ఈవో శ్రీ ఇసి.శ్రీధర్‌, ఇఇ శ్రీశివరామకృష్ణ ఇతర అధికారులు ఉన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here