ఎర్రచందనం దొంగలపై డ్రోన్ కెమెరాల నిఘా!

chandrababu naidu_5_0_0_0_0_0_0_0_0_0_0ఎర్రచందనం స్మగ్లర్ల ఆటకట్టించేందుకు డ్రోన్ కెమెరాలను లేదా బెలూన్ కెమెరాలను ఉపయోగించబోతోంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఈ పర్యవేక్షణను టీవీ వైట్ స్పేసెస్ ప్రాజెక్టు కింద చేపట్టేందుకు ముఖ్యమంత్రి ప్రతిపాదించారు. ప్రజా భద్రత విషయంలో రాజీ పడొద్దని.. నిఘా, రక్షణ విభాగాలను పటిష్టం చేయమని శాంతి భద్రతల సమీక్షలో చంద్రబాబు అధికారులను ఆదేశించారు. క్రిందటి ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది క్రైమ్ రేటు తగ్గిందని అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. అయినప్పటికీ నమోదవుతున్న సైబర్ నేరాలు, మహిళలపై దాడులూ, ఆర్థిక నేరాలు, రోడ్డు ప్రమాదాల పట్ల మరింత నిబద్ధతతో పనిచేయాలని చంద్రబాబు వారికి సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *