ఎపికు కేంద్ర ప్రభుత్వం చిన్నపాటి శుభవార్త

59

ఆంధ్రప్రదేశ్‌కు కేంద్ర ప్రభుత్వం చిన్నపాటి శుభవార్త అందించింది. కేంద్రం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్మార్ట్‌ సిటీస్‌ మిషన్‌లో భాగంగా రూ.9,940కోట్లు విడుదల చేసింది. ‌అందులో ఆంధ్రప్రదేశ్‌లోని నాలుగు నగరాల అభివృద్ధికి రూ.588కోట్లు కేటాయించారు.
రాష్ట్రాల వారిగా చూస్తే..

మహారాష్ట్రకు రూ.1,378కోట్లు

మధ్యప్రదేశ్‌కు రూ.984కోట్లు (99 నగరాలు)

తమిళనాడుకు రూ.848 కోట్లు

కర్ణాటకకు రూ.836కోట్లు (7 నగరాలు)

రాజస్థాన్‌కు 784కోట్లు విడుదల చేసింది.

ఆంధ్రప్రదేశ్‌కు రూ.588కోట్లు (7 నగరాలు)

ఉత్తర్‌ప్రదేశ్‌లోని రూ.547కోట్లు (10 నగరాలు)

గుజరాత్‌కు రూ.509కోట్లు విడుదల చేసింది.

నిధులు ఇలా వాడాలి..!

కేంద్రం విడుదల చేసిన ఈ నిధులతో ఆయా రాష్ట్రాల్లో స్మార్ట్‌ రోడ్లు, తాగునీటి సరఫరాను మెరుగు పరచడం, సైకిల్‌ ట్రాక్స్‌, పాదచారుల కోసం ట్రాక్‌, స్మార్ట్‌ క్లాస్‌ రూమ్స్‌, నైపుణ్యాభివృద్ధి కేంద్రాలు, ఆరోగ్య సౌకర్యాల మెరుగు, పాన్‌ సిటీ ప్రాజెక్టులను నిర్మించాల్సి ఉంది. మొత్తం వంద నగరాలను ‘స్మార్ట్‌’గా మారుస్తారు. ఒక్కో స్మార్ట్‌ సిటీకి ఏడాదికి కేంద్రం రూ.వంద కోట్లు సమకూర్చుతుంది. ఇలా ఐదేళ్లపాటు నిధులు ఇస్తారు.‘స్మార్ట్‌ సిటీ’లకు కేంద్రం ఇచ్చే నిధులను… ప్రజలకు గరిష్ఠ ప్రయోజనాలు కల్పించేలా మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల అభివృద్ధి కోసమే వెచ్చించాలి. స్మార్ట్‌ సిటీలకు అవసరమైన విద్యుత్తులో కనీసం 10 శాతం సంప్రదాయేతర వనరుల నుంచి ఉత్పత్తి చేయాలి. భవనాలను 80 శాతం పర్యావరణ అనుకూల విధానాలను అనుసరించి నిర్మించాలి. కొత్తగా అభివృద్ధి చేసే గృహ నిర్మాణ ప్రాజెక్టుల్లో 35% ఆర్థికంగా వెనుకబడిన వారికి కేటాయించాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here