ఎన్నికల కోడ్ ఉల్లంఘన ..అడ్డంగా బుక్ అయిన ప్రకాష్ రాజ్

86

బెంగళూరు సెంట్రల్ నుండి స్వతంత్ర అభ్యర్థిగా లోక్ సభ ఎన్నికల బరిలోకి దిగిన సినీ నటుడు ప్రకాష్ రాజ్ ఎలక్షన్ కోడ్ ఉల్లంఘన కేసులో అడ్డంగా బుక్ అయ్యారు.

ప్రకాష్ రాజ్ ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించారని ఆయన పైన అందిన ఫిర్యాదుతో ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు కబ్బన్ పార్కు పోలీస్ స్టేషన్ లో ప్రకాశ్ రాజ్ పై కేసు నమోదయింది.

ఈ నేపథ్యంలోనే ప్రకాష్ రాజ్ మాట్లాడుతున్న వీడియోను తీసిన కొందరు ఆ వీడియోను ఎన్నికల అధికారులకు వాట్సాప్ ద్వారా పంపించారు. ఆ వీడియోలు చూసిన ఎన్నికల అధికారులు అక్కడకు వెళ్లేసరికి కార్యక్రమం పూర్తి అయింది.

ఈ నేపథ్యంలో ఎలక్షన్ కోడ్ ఉల్లంఘనకు పాల్పడిన ప్రకాశ్ రాజ్ పై వాట్సాప్ లో వచ్చిన వీడియో ఆధారంగా కేసు నమోదు చేశారు.

మీడియా మరియు ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ పైన ప్రవీణ్ మరియు అభిలాష్ అనే ఇద్దరు ర్యాలీ నిర్వహించేందుకు అనుమతి తీసుకున్నప్పటికీ ఆ ర్యాలీలో ప్రకాష్ రాజ్ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు

కాబట్టి ఎన్నికల అధికారుల ఫిర్యాదు మేరకు ర్యాలీ నిర్వహించిన ప్రవీణ్ మరియు అభిలాష్ ల పైన , ర్యాలీలో రాజకీయ ప్రచారం నిర్వహించిన ప్రకాష్ రాజ్ పైన కేసులు నమోదయ్యాయి.

మొత్తానికి ప్రకాష్ రాజ్ ఎలక్షన్ కోడ్ ఉల్లంఘించి ఎన్నికల అధికారుల చేతుల్లో అడ్డంగా బుక్కయ్యాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here