ఎన్టీఆర్ గృహాలు..ఆనందాల లోగిళ్లు

58

రాష్ట్ర మంతా పండ‌గ వాతావ‌ర‌ణం. ఎవ‌రైనా ఇల్లు క‌ట్టుకుని మ‌న‌ల్ని గృహ‌ప్ర‌వేశానికి ఆహ్వానిస్తారు. సంతోషంగా పండ‌గ‌లా ఆ కార్య‌క్ర‌మాన్ని జ‌రుపుకుంటారు. అది ఆ ఇంటికే ప‌రిమితం. ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడు చ‌ల‌వ‌తో ఆంధ్ర‌ప్ర‌దేశ్ అంత‌టా పండ‌గ వాతావ‌ర‌ణం నెల‌కొంది. మంత్రి కాల‌వ శ్రీనివాసులు చొర‌వ‌తో ప్ర‌తి ఇల్లూ ఆనందాల లోగిలిగా మారింది. ప‌చ్చ‌ని మామిడి ఆకుల తోర‌ణాలు, ఇంటి ముందు అర‌టి చెట్ల స్వాగ‌తం, గుమ్మం కొబ్బ‌రి ఆకుల పందిరి. ప్ర‌తీ ఇల్లు ప‌చ్చ‌గా, కొత్త‌గా మ‌న‌ల్ని స్వాగ‌తిస్తోంది. ఒకే రోజు 3 ల‌క్ష‌ల ఎన్టీఆర్ గృహాల‌లో ల‌బ్ధిదారులు ప్ర‌వేశాలు నిర్వ‌హించారు. గ‌తేడాది ప్రపంచ ఆవాస దినోత్స‌వం సంద‌ర్భంగా అక్టోబ‌ర్ 2న ఒకేసారి రాష్ర్ట‌వ్యాప్తంగా 1 ల‌క్ష ఇళ్ల గృహ ప్రవేశ‌ మ‌హోత్స‌వాలు నిర్వ‌హించారు. గురువారం 3 ల‌క్ష‌ల గృహ ప్ర‌వేశాల మ‌హోత్స‌వం నిర్వ‌హిస్తున్నారు. ఆంధ్ర ప్ర‌దేశ్ గృహ‌నిర్మాణ శాఖ‌, గృహ‌నిర్మాణ సంస్థ ఆధ్వ‌ర్యంలో ఇందిరాగాంధీ స్టేడియంలో జ‌రిగే వేడుక‌ల‌కు ముఖ్య అతిథిగా ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడు హాజ‌ర‌య్యారు. ఒక ల‌క్ష గృహ‌ప్ర‌వేశాలు జ‌రిగిన‌ ఎనిమిది నెల‌ల కాలంలో దీనికి రెండు వొంతులు అంటే 3 ల‌క్ష‌ల గృహ‌ప్ర‌వేశాలు చేయ‌డం ఓ అరుదైన రికార్డ్‌. ప్ర‌భుత్వం ఎన్టీఆర్ గృహ నిర్మాణ ప‌థ‌కం, ఇత‌ర ప‌థ‌కాల ద్వారా ఐదేళ్ల‌లో 10 ల‌క్ష‌ల గృహాలు ల‌క్ష్యంగా నిర్ణ‌యించికుంది. ఇప్ప‌టివ‌ర‌కూ 5 ల‌క్ష‌ల 71 వేల ఇళ్ల నిర్మాణం పూర్త‌య్యింది. ఇళ్లు క‌ట్టుకున్నా..ఇంట్లో శుభ‌కార్యం జ‌రిగినా ఆ కుటుంబం సంతోషానికి హ‌ద్దులుండ‌వు. అటువంటిది ఒకే రోజు మూడు ల‌క్ష‌ల ఇళ్లు అంటే.. దాదాపు 3 ల‌క్ష‌ల కుటుంబాలు ఆనందాల లోగిళ్లుగా మార‌నున్నాయి.అన్న ఆశ‌యం, చంద్ర‌న్న ఆచ‌ర‌ణ‌లో పెట్ట‌డం, గ్రామీణ గృహ‌నిర్మాణ‌శాఖ‌ మంత్రి కాల‌వ శ్రీనివాసులు చొర‌వతో ప్ర‌భుత్వం నిర్ణ‌యించుకున్న 10 ల‌క్ష‌ల గృహాల ల‌క్ష్యం త్వ‌ర‌లోనే సాకారం కానుంది. ప్ర‌భుత్వ సాయం, వివిధ ప‌థ‌కాల కింద ఇళ్లు క‌ట్టుకున్న పేద‌వారి క‌ళ్ల‌లో సంతోషం చూడ‌టంని మించిన ఆనందం ఏముంటుంద‌ని సంబంధిత శాఖా మంత్రి కాల‌వ శ్రీనివాసులు త‌న భావోద్వాన్ని అణుచుకోలేక ఆనంద‌భాష్పాలు రాల్చారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here