ఎన్టీఆర్‌కు ఇష్టమైన జిల్లాకు వరాల జల్లు..!

106

202ఎన్టీఆర్‌కు అత్యంత ఇష్టమైన జిల్లా అనంతపురమని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. 70వ స్వాతంత్య్ర దిన వేడుకల సందర్భంగా అనంతపురంలో ఆయన జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అనంతపురం జిల్లాకు వరాల జల్లు కురిపించారు. ఎన్టీఆర్‌ స్ఫూర్తితో అనంతపురాన్ని అభివృద్ధి చేసే బాధ్యతను తాను తీసుకుంటున్నట్లు చెప్పారు. ఎన్టీఆర్‌ ఆశయం పేరుతో రూ.6,554 కోట్ల ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించారు. తమ పార్టీకి అండగా ఉన్న జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామన్నారు.
ప్యాకేజీ నిధుల కేటాయింపు ఇలా..
* కరవు నివారణకు రూ.1,767 కోట్లు
* తాగునీటికి రూ.500 కోట్లు
* పరిశ్రమలకు రూ.100కోట్లు
* రహదారుల అభివృద్ధికి రూ.139కోట్లు
* స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్‌ కింద రూ.94కోట్లు
* వ్యవసాయం, అనుబంధ రంగాలకు రూ.2,654కోట్లు
* పేరూరు ప్రాజెక్ట్‌ ఫేజ్‌-1కు రూ.850కోట్లు
* బైరవానితిప్ప ప్రాజెక్టు ఫేజ్‌-1 కింద రూ.450కోట్లు
* 2లక్షల బోర్ల రీఛార్జికి రూ.400కోట్లు
* మరో లక్ష పంటకుంటల ఏర్పాటుకు రూ.850కోట్లు
* 400 చెరువుల ఆధునికీరణకు రూ.450కోట్లు
* పెన్నా-కుముదవతి ప్రాజెక్టుకు రూ.17కోట్లు
* ఎగువ పెన్నా ఆధునికీరణకు రూ.20కోట్లు
* పంట మార్పిడి పథకానికి రూ.25కోట్లు
* సూక్ష్మ పోషకాల సరఫరాకు రూ.45కోట్లు
* వ్యవసాయం యాంత్రీకరణకు రూ.45కోట్లు
* పశుగణాభివృద్ధికి రూ.776కోట్లు
* ఉద్యాన పంటల అభివృద్ధికి రూ.1,428కోట్లు
* మల్చింగ్‌ కోసం రూ.36కోట్లు
* పనిముట్ల మరమ్మతులకు రూ.10 కోట్లు
* పట్టు పరిశ్రమకు రూ.71కోట్లు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here