ఎట్టకేలకు వైసీపీ గూటికే మాజీ ఎంపీ మాగుంట

56

మాజీ ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి మూడు పార్టీలను మూడు గుంటల నీళ్లు తాగిస్తున్నాడు. టీడీపీ మాగుంటను నెల్లూరు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయించాలని గతంలో వార్తలు వచ్చాయి. అంతకుముందే మాగుంట వైసీపీలో చేరుతాడన్న వార్తలు కూడా వచ్చాయి. ఈ రెండింటినీ మాగుంట కాదననూలేదు.. ఖండించనూ లేదు. తాజాగా నిన్న మాగుంట ఒంగోలులో పవన్ కళ్యాణ్ ను కలిసిన ఫోటోలు మీడియాలో దర్శనమిచ్చాయి. దీంతో మాగుంట జనసేనలో చేరుతాడన్న మరో వార్త గుప్పుమంది. సాధారణంగా మాగుంట స్థాయి వ్యక్తులు ప్రత్యర్థి పార్టీ నాయకులను బహిరంగంగా కలుసుకుంటే ఆ పార్టీలో చేరుతారనే అభిప్రాయం కలగడం సహజం. అయితే తాజాగా మాగుంట శ్రీనివాసులు రెడ్డి వైసీపీలో చేరేందుకు తుది నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. మరో మూడు రోజుల్లో ఆయన జగన్ను కలిసి వైసీపీ కండువా కప్పుకోనున్నారు. దానికి ముందే ఎమ్మెల్సీ పదవికి కూడా రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నారు. ఒంగోలు పర్యటనలో వున్న పవన్.. మాగుంటకు ఫోన్ చేసి.. మిమ్మల్ని కలవాలనుకుంటున్నానని.. చెప్పడంతో .. మాగుంట.. తానే వెళ్లి పవన్ కళ్యాణ్ ను కలిసొచ్చినట్టు తెలుస్తోంది. దీంతో మాగుంట శ్రీనివాసులరెడ్డి జనసేన పార్టీలో చేరుతారనే పుకారు షికారు చేసింది. ఎటువంటి రాజకీయ వివాదాల జోలికి వెళ్లని సాధు స్వభావిగా వుండే మాగుంట శ్రీనివాసులు రెడ్డి.. మౌనంగా ఉంటూనే మూడు పార్టీలకు ఇప్పటివరకూ గుంటలో నీళ్లు త్రాగించాడు. చివరకు ఆయన వైసీపీలోనే చేరేందుకే నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here