ఎంతో అనుభవం ఉన్న నేతలు కీడు చేస్తున్నారు: ట్విట్టర్‌లో పవన్

30

ఇండియన్ ఎకానమీ…వ్యవస్థ లోపాలపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు.

ఎకానమీ పెరుగుతూ ఉండవచ్చు… ప్రపంచ వేదికపై మెరుస్తూ ఉండవచ్చు.. కానీ రాజకీయ వ్యవస్థలో ఉన్న అవినీతి దేశాన్ని దిగజారుస్తోందని అంటూ పవన్ ట్వీట్ చేశారు.

ప్రజల పట్ల, వ్యవస్థల పట్ల రాజకీయ నేతలకు ఎలాంటి పట్టింపులు లేకపోవడం వ్యవస్థను నాశనం చేస్తోందని తెలిపారు.

దేశరాజధాని ఢిల్లీ సహా దేశమంతా స్వచ్ఛమైన గాలి కూడా లేక ఇబ్బంది పడుతోందని పవన్ ట్వీట్ చేశారు.

దీనికి ఉదాహరణగా ఏపీలోని తుండూరు ఆక్వాపార్కును తీసుకువచ్చారాయన.

ఈ ప్రాంతానికి చెందిన యువకులు తనను కలిశారని, కనీసం స్వచ్ఛమైన గాలి, నీరు కూడా తమకు లేకుండా చేస్తున్నారని వారు తన వద్ద ఆవేదన వ్యక్తం చేశారని పవన్ కల్యాణ్ అన్నారు.

ఎంతో అనుభవం ఉన్న రాజకీయ నేతలు చేస్తున్న ప్రయోగాలు వ్యవస్థకు మంచి చేయకపోగా కీడు చేస్తున్నాయని పవన్ అన్నారు.

లోపబూయిష్టమైన పబ్లిక్ పాలసీలు, స్థిరంగా లేని ఆర్థిక ఎదుగుదల, బలహీన వర్గాలపై బలంగా పనిచేసే చట్టాలు, బలంగా ఉన్నవారిపై బలహీనంగా పనిచేసే చట్టాలు ఇలా ఎన్నో అంశాలు వ్యవస్థను పీడిస్తున్నాయని తెలిపారు.

ఇది ఇలాగే కొనసాగితే ప్రాథమిక హక్కుల కోసం కూడా ప్రజలు పోరాడాల్సి వస్తుందని హెచ్చరించారు.

దేశంలోని కోట్లాది మంది ప్రజలు ఇదే భావనలో ఉన్నారని ట్విట్టర్ ద్వారా తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here