ఈ దేశానికి కాంగ్రెస్ పార్టీ అవసరం…రఘువీరా

ఈ దేశం ఎప్పుడు ఇబ్బందుల్లో ఉంటే అప్పుడు కాంగ్రెస్ పార్టీ త్యాగాలకు సిద్ధమవుతుందని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు రఘువీరారెడ్డి పేర్కొన్నారు. గెలుపోటములు గురించి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ఆలోచన చేయలేదన్నారు. విజ‌య‌వాడ‌లోని ఆంధ్ర‌ర‌త్న‌భ‌వ‌న్‌లో గురువారం ఉద‌యం నిర్వ‌హించిన 133వ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని రఘువీరారెడ్డి పాల్గొని పార్టీ జెండాను ఆవిష్కరించి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ, మహిళా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఫోటోగ్యాలరీని ప్రారంభించి, నాయకులను అభినందించారు. అనంత‌రం ర‌ఘువీరారెడ్డి మీడియాతో మాట్లాడుతూ 133 సంవత్సరాల క్రితం 72 మందితో మొదలైన ఉద్యమం నేడు కోట్ల మందికి అంకితం అయ్యేలా మొత్తం ఫోటో గ్యాలరీని కళ్లకు కట్టినట్లు మంచి ఫోటోగ్యాలరీని ఏర్పాటు చేయ‌డం అభినంద‌నీయ‌మ‌న్నారు. ఏపి కాంగ్రెస్ సేవాదళ అధ్యక్షులు భవానీ నాగేంద్రప్రసాద్ ఆధ్వర్యంలో తొలుత రఘువీరారెడ్డి కాంగ్రెస్ పార్టీ పతాకావిష్కరణ చేశారు, అనంతరం జరిగిన సభలో స్వాతంత్ర్య సమరయోధులైన రాంపిళ్ల నరసాయమ్మ కాంగ్రెస్ పార్టీ సేవలందించిన శేఖర్, మల్లికార్జున‌శర్మ సాయి, కొడాలి జగన్మోహన్‌ల‌ను సన్మానించారు. అనంతరం ఇందిరమ్మ, రాజీవ్‌గాంధీ దేశం కోసం చేసిన త్యాగాలను స్మరించుకుంటూ చిన్నారులు చేసిన నృత్యరూపకం అందరినీ ఆకట్టుకుంది. అనంతరం కోనేరు రంగారావు, పిన్నమనేని కోటేశ్వరరావు, చనుమోలు వెంకట్రావు, మండలి కృష్ణారావు, వంగవీటి మోహనరంగా, పాలడుగు వెంకట్రావు, మొక్కపాటి వెంకటేశ్వరరావు, జిల్లాకు చెందిన పలువురి నాయకులను స్మరించుకొని వారికి జోహార్లు అర్పించారు.
విద్యార్థులు కాంగ్రెస్ పార్టీలో చేరిక …
ఎన్ఎస్‌యుఐ రాష్ట్ర అధ్యక్షులు భగత్ ఆధ్వర్యంలో నగర విద్యార్థి ఫెడరేషన్ విభాగానికి చెందిన 100 మంది విద్యార్థులు రఘువీరారెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సంద‌ర్భంగా విద్యార్థులకు పార్టీ కండువాలు కప్పి ర‌ఘువీరారెడ్డి సాదరంగా వారిని పార్టీలోకి ఆహ్వానించారు. అనంత‌రం రఘువీరారెడ్డి మాట్లాడుతూ 2009, 2012 సంవత్సరాల్లో రెండు సార్లు ప్రధానమంత్రి పదవి స్వీకరించూ. అని సాక్షాత్తు మన్మోహన్‌సింగ్ చెప్పినా కూడా నాకు వద్దు అంటూ త్యాగాలకు సిద్దమైన కుటుంబం నుంచి వచ్చిన రాహుల్‌గాంధీని ప్రధాని చేయడమే అందరి లక్ష్యం కావాలని పిలుపునిచ్చారు. ఇటీవల జరిగిన గుజరాత్ ఎన్నికల్లో రాహుల్‌గాంధీకి విజయపరంపర ప్రారంభమైందన్నారు. 2012నుంచి రాహుల్‌గాంధీ యువతలో ఉన్న నాయకత్వ లక్షణాలను బయటకు తీసేందుకు ఈ ఎన్నికల ప్రక్రియ నిర్వహిస్తున్నట్లు యూత్‌ కాంగ్రెస్‌ రాష్ట్ర జనరల్‌ సెక్రటరీ, యువజన కాంగ్రెస్‌ రాష్ట్ర కార్యాలయ ఇన్‌ఛార్జి పెద్దిరెడ్డి ప్రదీప్‌ తెలియజేసారు. ఈకార్యక్రమంలో కృష్ణాజిల్లా యువజన కాంగ్రెస్‌ అధ్యక్షులు ఆల్తి కృష్ణమురళీ, యువజన కాంగ్రెస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అట్లూరి విజయకుమార్‌, జనరల్‌ సెక్రటరీ సుజాత, రామారావు, దారా ఫణీంద్ర, శీలం రామకృష్ణ, ముగతాటి నాగయ్య తదితరులు పాల్గొన్నారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *