ఈ ఉగాది నాకో కొత్త అనుభూతి..హీరో నాని

104

Jenda-Pai-Kapiraju-apvarathalu-comవిబిన్నమైన కథ చిత్రాల్లో నటిస్తూ నటుడిగా మంచి మార్కులు సంపాదించుకున్నాడు నాని. ముక్యంగా స్టార్ డం కంటే కుడా నటుడిగానే చక్కటి విజయాలు అందుకున్నాడు. ప్రస్తుతం నాని హీరోగా నటించిన చిత్రం ‘జెండా పై కపిరాజు’. సముద్ర ఖని దర్శకత్వం లో రూపొందిన ఈ చిత్రాన్ని మల్టీ డైమన్షన్ ప్రైవేటు లిమిటెడ్ పతాకం పై పి రామమోహనరావు సమర్పణలో రజత్ పార్థ సారధి, శ్రీనివాసన్ లు నిర్మించారు. ఈ చిత్రం ఉగాది కానుకగా విడుదలవుతున్న సందర్బంగా హీరో నాని మాట్లాడుతూ … ఈ ఉగాది నాకో కొత్త అనుభూతిగా ఉండబోతుంది. ఒకే సారి రెండు చిత్రాలు జెండాపై కపిరాజు , ఎవడే సుబ్రహ్మణ్యం విడుదల అవ్వడం చాలా ఆనందంగాను, అదే టైం లో టెన్షన్ గాను ఉంది. రెండు విబిన్నమైన సినిమాలు కావడం ప్లస్ అయ్యింది. ఇక జెండాపై కపిరాజు సినిమా మంచి కాన్సెప్ట్ తో రూపొందించారు. ముక్యంగా ఇందులో రెండు పాత్రలు చేయడం నాకే కొత్తగా అనిపించింది. ముందు ఈ కథ సముద్రఖని చెప్పినప్పుడు ఈ పాత్ర నేను చేయగలనా అనిపించింది, కాని సముద్ర ఖని సపోర్ట్ తో ఈ రెండు పాత్రలు చాలా బాగా చేశాను. ఒక పాత్ర మనలో ఒకడిగా సాధారణ యువకుడిగా కనిపిస్తాను, రెండో పాత్ర తమిళనాడు నుండి వ్యక్తిగా బిన్నమైన నటన కనబరిచాను , మీరు చుస్తే నిజంగా ఇది నాని నా లేక వేరే వ్యక్తా అనేలా ఉంటుంది . మంచి సందేశం తో రూపొందిన ఈ సినిమా ప్రతి ఒక్కరికి నచ్చుతుంది. నిన్ను నివ్వు బాగుచేసుకుంటే దేశం దానంతట అందే బాగుపడుతుంది అనే మెసేజ్ తో సముద్రఖని అద్బుతంగా రూపొందించారు. నిజంగా ఈ ఆయనకు హత్సాప్ చెప్పాల్సిందే. ఇక నిర్మాతలు కుడా ఎక్కడా ఎ విషయంలో తగ్గకుండా భారిగా నిర్మించారు. సో తప్పకుండా మాస్ ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఈ సినిమా ఉంటుంది. అలాగే ఎవడే సుబ్రహ్మణ్యం సినిమా కుడా ఓ కొత్త ఫీల్ కలుగుతుంది .. సో ఈ ఉగాదికి ఈ రెండు సినిమాలతో నన్ను ఆదరిస్తారని కోరుకుంటున్నాను అన్నారు.

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here