ఈసీ, సీఎస్ లపై మంత్రి జవహర్ ఆగ్రహం..!

117

ఏపీలో ఎన్నికల నిర్వహణ కోసం ప్రధాన కార్యదర్శిని ఎన్నికల సంఘం నియమిస్తే సీఎస్ పరిధి దాటి వ్యవహరిస్తున్నారని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి కె.ఎస్.జవహర్ ఆగ్రహించారు.ఈ మేరకు ఆదివారం ఒక పత్రిక ప్రకటన విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజాప్రభుత్వం ఉన్నప్పుడు ఆపద్ధర్మ ప్రభుత్వము ఉన్నట్లు వ్యవహరించాలని సీఎస్ చెప్పటం హాస్యాస్పదంగా ఉందన్నారు. స్టాఫ్ గ్యాప్ ఆరంజిమెంట్లో సీఎస్ ని నియమించిన ఎన్నికల కమిషన్ ఏమైందని ప్రశ్నించారు.ఫణి తుపాన్ రాష్ట్రం వైపు దుసుకువస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను అప్రమత్తం చేయటం నేరమా అని ప్రశ్నించారు ? తుపాను కారణంగా రాష్ట్రవ్యాప్తంగా తీవ్రమైన నష్టం వాటిల్లితే ఎవరు బాధ్యత వహిస్తారన్నారు. సమీక్షలు చేయకపోతే పాలన పరమైన వ్యవహారాలు ఎవరు చూస్తారు ఎన్నికల సంఘమా లేకా నరేంద్రమోదీనా అంటూ జవహర్ మండి పడ్డారు. కేంద్రంలో ఎక్కడా క్యాబినెట్ కార్యదర్శి జోక్యం చేసుకోవడం లేదు.కానీ ఏపీలో మాత్రం ఈసి నియమించిన సీఎస్ ఎందుకు జోక్యం చేసుకుంటున్నారో తెలియటం లేదన్నారు. పోలవరం ప్రాజెక్టు పనులు ప్రారంభించింది ప్రజా ప్రభుత్వం.దాన్ని పూర్తి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది.అలాంటిది పోలవరం ప్రాజెక్టుపై ముఖ్యమంత్రి రివ్యూ చేయకూడదు అనటం విడ్డురంగా ఉందన్నారు.ప్రధానంగా రాష్ట్రంలోని దళిత,గిరిజన వాడల్లో తాగునీటి ఇబ్బదులు రాకుండా ఉండలని ముందస్తూ ప్రణాళికా ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించటం నేరమా అన్నారు.పోలవరం పనుల జాప్యత జరిగితే వ్యయ బాధ్యత ఎవరు వహిస్తారన్నారు.హన్స్ ఇండియా పత్రికలో సీఎస్ ఎల్వీ చేసిన వ్యాఖ్యలు మాలిఫైడ్ ఇంటెన్షన్ తో మాట్లాడినట్లు ఉన్నాయన్నారు.ప్రధాని మోదీ సారథ్యంలో విజయసాయిరెడ్డి దూతగా సీఎస్ వ్యయహరిస్తున్నారని మంత్రి జవహర్ ఆగ్రహించారు.ఇదే పరిస్థితి కొనసాగించాలని చూస్తే ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here