‘ఈడు గోల్డ్ ఎహే’లో నేను పక్కా మాస్: రిచాపనయ్

28

‘ఈడు గోల్డ్‌ ఎహే’. విజయదశమి కానుకగా అక్టోబర్‌ 7న వరల్డ్‌వైడ్‌గా రిలీజ్‌ అవుతున్న ఈ సినిమాలో యముడికి మొగుడుతో తెలుగు తెరకు పరిచయమైన రిచా పనయ్… ‘ఈడు గోల్డ్ ఎహే’లో సునీల్ తో జతకట్టింది. ఈ సందర్భంగా హీరోయిన్ రిచాపనయ్ మాట్లాడింది. ‘ఇందులో ‘ఈడు గోల్డ్ ఎహే’ పక్కా మాస్‌ సినిమా. నా క్యారెక్టర్‌ కూడా పక్కా మాస్‌గానే ఉంటుంది. నా మొదటి సినిమాకి దీనికీ చాలా తేడా ఉంటుంది. ఈ సినిమాలో కొత్త రిచాని చూస్తారు. ఈ ప్రాజెక్ట్ ఓకె అనుకున్న తర్వాత డైరెక్టర్ వీరుపోట్ల నాకు తెలుగు నేటివిటీకి త‌గ్గ‌ట్లుగా యాక్టింగ్ స్కిల్స్ లో ట్రైనింగ్ ఇచ్చారు. ప్ర‌తీ సీన్ ఎలా చేయాలో చేసి చూపించేవారు. దానివ‌ల్ల నాకు ఈ క్యారెక్ట‌ర్ చేయ‌డం చాలా ఈజీ అయ్యింది. నాకు డ్యాన్స్ అంటే చాలా పిచ్చి. ఏమాత్రం ఖాళీ దొరికినా డ్యాన్స్‌ ప్రాక్టీస్‌ చేస్తాను. దాంతో ప్రత్యేకించి జిమ్‌కి వెళ్ళాల్సిన అవసరం నాకు రాలేదు. ఈ సినిమా జ‌రుగుతున్న‌ప్పుడు డ్యాన్స్ విష‌యంలో సునీల్ గారిని ఫాలో అయ్యాను. డ్యాన్స్ స్టెప్ట్స్ సునీల్ ని అడిగి తెలుసుకొనేదాన్ని. ఈ సినిమాలో నాకు సునీల్ కు మ‌ధ్య రెండు పాట‌లు ఉన్నాయి. అందులో ఒక‌టి సిచ్యువేష‌న‌ల్ సాంగ్ అయితే ఇంకొక పాట‌లో నేను, సునీల్, సుష్మా ముగ్గురం క‌లిసి చేసాం. ముగ్గురం క‌లిసి చేసిన పాట సినిమాకి పెద్ద మాస్ నంబ‌ర్. ఫుల్ ఆన్ మ‌స్తీ ఉంటుంది. ప్రేక్ష‌కులు ఈ పాట చూస్తున్నంత‌సేపు ప‌క్కా ఎంజాయ్ చేస్తారు.చిన్నప్ప‌టినుంచీ న‌రాకు యాక్టింగ్ అంటే ఇష్టం ఉండేది. అయితే స్టేజ్‌ ప్రోగ్రామ్‌లు అలాంటివి ఏవీ చేయలేదు. చదువు పూర్తి అయిన‌ తరువాత ఎయిర్‌ హోస్టెస్‌గా జాబ్‌ వచ్చింది. ఆ జాబ్‌ చేస్తునే చాలా యాడ్స్‌ చేశాను. నా యాడ్స్‌ చూసిన దర్శకనిర్మాతలు నాకు సినిమాల్లో అవకాశం ఇచ్చారు. య‌ముడికి మొగుడు సినిమా త‌ర్వాత చంద‌మామ క‌థ‌లు సినిమాలో చేశౄను. చంద‌మామ క‌థ‌లు చేస్తున్న‌ప్పుడే నాకు ఈ సినిమా గురించి అనిల్ సుంక‌ర గారు అడ‌గ‌డంతో ఓకే అనేశాను. నాకు ఎకె ఎంట‌ర్టైన్మెంట్స్ ప్రొడ‌క్ష‌న్ హౌజ్ అంటే చాలా ఇష్టం. ఎందుకంటే సినిమాకి డ‌బ్బులు పేచేస్తున్నాం క‌దా వాళ్ళ ప‌ని వాళ్ళు చేసుకుంటారులే అనుకొనే ఈ రోజుల్లో నా బ‌ర్త్ డే రోజు ముంబైలో మా ఇంటికి బొకే పంపించి ఆర్టిస్టుల ప‌ట్ట ఎంత కేరింగ్ తీసుకుంటారో చూపించారు. తెలుగులో ఇప్పటికే చాలా కథలు విన్నాను. సెలెక్టివ్ గా వెళ్ళాల‌ని డిసైడ్ అయ్యాను. అందుకే ఈడు గోల్డ్ ఎహే త‌ర్వాత ఓ మంచి కథతో త్వరలో తెలుగు ఆడియ‌న్స్ ముందుకి వ‌స్తాను. ప్ర‌స్తుతానికి రెండు ప్రాజెక్టులు చ‌ర్చ‌ల ద‌శ‌లో ఉన్నాయి. ఓకె అవ్వ‌గానే చెప్పేస్తాను. అని చెప్పుకొచ్చింది రిచా ప‌నాయ్ ఓ స్టార్‌ హీరోతో సినిమా చేసే అవకాశం ఉంది. ఆ హీరో ఎవరు? ఆ సినిమా ఏంటి? అనే వివరాలు తర్వాత చెబుతాను’ అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here