ఇస్రోతో సంబంధాలు కోల్పోయిన జీశాట్‌-6ఏ

25

భారత్‌ ప్రయోగించిన అధునాతన ఉపగ్రహం జీశాట్‌-6ఏతో సంబంధాలు కోల్పోయినట్లు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) అధికారులు వెల్లడించారు.దాని నుంచి ఎలాంటి సమాచారం అందడం లేదని జీశాట్‌-6ఏను ప్రయోగించిన 48 గంటల తర్వాత ఇస్రో తెలిపింది.ఈ ఉపగ్రహానికి సంబందించి చివరిదైన మూడో లామ్‌ ఇంజిన్‌ను మండించిన సమయం నుంచి దానితో అనుసంధానం కోల్పోయామని ఇస్రో తన అధికారిక వెబ్‌సైట్‌లో పేర్కొంది.చివరిసారిగా దాని నుంచి మార్చి 30న ఉదయం 9.22 నిమిషాలకు సమాచారం అందిందని ఇస్రో వెల్లడించింది. మొదటిసారి కక్ష్య పెంపు ప్రక్రియ చేపట్టిన సమయంలో అది సమాచారాన్ని చేరవేసిందని పేర్కొంది. ఆ తర్వాత రెండోసారి కక్ష్య పెంపును మార్చి 31న చేపట్టినట్లు తెలిపింది.ఉపగ్రహంతో అనుసంధానం కావడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని ఇస్రో అధికారులు వెల్లడించారు.భారత్‌ అభివృద్ధి చేసిన రాకెట్లలో రెండో అతిపెద్దదిగా పేరు గాంచిన ఈ జీశాట్‌-6ఏ ఉపగ్రహాన్ని గురువారం విజయవంతంగా పరీక్షించిన విషయం తెలిసిందే.ప్రయోగం జరిగిన తర్వాత రాకెట్‌ నిర్ణీత కక్ష్యలో జీశాట్‌-6ఏ ఉపగ్రహాన్ని చేర్చడానికి 17 నిమిషాల సమయం పట్టింది. జీఎస్‌ఎల్‌వీ సిరీస్‌లోనే ఇది 12వది. ఈ ఉపగ్రహంలో విచ్చుకునే సామర్థ్యమున్న 6మీటర్ల ఎస్‌-బ్యాండ్‌ యాంటెన్నా, చేతిలో ఇమిడిపోయే భూతల టెర్మినళ్లు, నెట్‌వర్క్‌ నిర్వహణ విధానాలు ఉన్నాయి.ఇవన్నీ ఉపగ్రహ ఆధారిత కమ్యూనికేషన్‌ అవసరాలకు ఉపయోగపడనున్నాయి.ఈ ఉపగ్రహం మల్టీ బీమ్‌ కవరేజీ సౌకర్యం ద్వారా దేశవ్యాప్తంగా మొబైల్‌ కమ్యూనికేషన్‌ను అందించనుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here