ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని , డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ ల కాంబినేషన్ లో వస్తున్న ఇస్మార్ట్ శంకర్ చిత్రం ఇటీవలే ప్రారంభం అయ్యింది.. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ఈ చిత్రంలో హీరోయిన్ గా నిధి అగర్వాల్ ని ఎంపిక చేసినట్లు అధికారికంగా వెల్లడించారు.. అందం అభినయంతో ఆకట్టుకున్న నిధి అగర్వాల్ కి తెలుగులో ఇది మూడో సినిమా.. ప్రస్తుతం హైదరాబాద్ లో భారీ యాక్షన్ సీన్స్ చిత్రీకరణ జరుపుకుంటుండగా, హీరో రామ్ షూటింగ్ లో పాల్గొంటున్నాడు.. రియల్ సతీష్ ఈ యాక్షన్ ఎపిసోడ్ కి కొరియోగ్రఫీ చేస్తున్నాడు..త్వరలో నిధి అగర్వాల్ షూటింగ్ లో పాల్గొననుంది.. పునీత్ ఇస్సార్, సత్య దేవ్, మిలింద్ గునాజి, ఆశిష్ విద్యార్థి మరియు గెటప్ శ్రీను ఇతర పాత్రల్లో నటిస్తుండగా, మణిశర్మ సంగీతం సమకూరుస్తున్నారు.. పూరీ జగన్నాధ్ టూరింగ్ టాకీస్ , పూరీ కనెక్ట్స్ పతాకాలపై పూరీ జగన్నాధ్ , ఛార్మి కౌర్ లు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా ని మే లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు..
నటీనటులు : రామ్ పోతినేని, నిధి అగర్వాల్, పునీత్ ఇస్సార్, సత్య దేవ్, మిలింద్ గునాజి, ఆశిష్ విద్యార్థి, గెటప్ శ్రీను, సుధాన్షు పాండే, మధు సింగంపల్లి, కుల్దీప్ సింగ్, దీపక్ శెట్టి.