ఇన్నోవేషన్‌ వ్యాలీకి కేరాఫ్ అడ్రస్‌గా ఏపీ: చంద్రబాబు

ఇన్నోవేషన్‌ వ్యాలీకి కేరాఫ్ అడ్రస్‌గా ఏపీని మార్చేందుకు కృషిచేస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యానించారు.

శుక్రవారం ప్రారంభమైన టీడీపీ విస్తృతస్థాయి సమావేశంలో ఆయన మాట్లాడుతూ యువ పారిశ్రామికవేత్తలను ప్రోత్సహిస్తున్నామని అన్నారు.

రైతులను అన్ని విధాలా ఆదుకుంటున్నామని చంద్రబాబు చెప్పారు. రాష్ట్ర విభజన జరిగిన మూడు నెలల్లోనే విద్యుత్‌ కొరత సమస్యను అధిగమించామన్నారు.

విద్యుత్ చార్జీలు పెంచబోమని ప్రకటించిన మొదటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని ఆయన గర్వంగా చెప్పారు.

అన్ని గ్రామాల్లో సీసీ రోడ్ల నిర్మాణం చేపట్టామని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *