ఇంటింటికి టిడిపిలో కెసిఆర్ బొమ్మ

14

ప్రకాశం జిల్లా బల్లికురవ మండలంలో ఇంటింటికి టిడిపి కార్యక్రమంలో ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకొంది. టిడిపి మద్దతుదారులు ఏర్పాటుచేసిన ఫ్లెక్సీలో తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ ఫోటోను కూడ ఏర్పాటు చేశారు.

తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ టిఆర్ఎస్ ఏర్పాటు చేయకముందు టిడిపిలో ఉన్నారు. అయితే తెలంగాణ ఉద్యమం కోసం ఆయన టిఆర్ఎస్‌ను ఏర్పాటు చేశారు. ఇటీవల కాలంలో రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య స్నేహపూర్వక వాతావరణం కొనసాగుతోంది.

ప్రకాశం జిల్లా బల్లికురవ మండలం వెలమవారి పాలెంలో ఇంటింటికీ తెలుగుదేశం కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్‌కు స్వాగతం పలుకుతూ సర్పంచ్‌ ప్రవీణ్‌కుమార్‌ ఏర్పాటుచేసిన ఫ్లెక్సీలలో ఎన్టీఆర్‌, చంద్రబాబు ఫొటోలతో పాటు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఫొటో కూడా పెట్టారు.

వెలమవారిపాలెంలో 90 శాతం మంది ఒకే సామాజిక వర్గానికి చెందిన వారు నివసిస్తారు. ప్రస్తుత సర్పంచ్‌ మామిళ్ళపల్లి ప్రవీణ్‌కుమార్‌తోపాటు తండ్రి సాంబశివరావు కూడా టీడీపీ మద్దతుదారులు కావటంతో వారి అభిమానం ఫ్లెక్సీలలో ఉట్టిపడేలా తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here