ఆ మాట అనడానికి జగన్‌కు నోరెలావచ్చింది: మంత్రి దేవినేని

56

పోలవరం ప్రాజెక్టులో ఎంతోమంది త్యాగాలున్నాయని, పోలవరం డ్యామ్ సైట్ లో 9వేల మంది ఇంజనీర్లు, సాంకేతిక నిపుణులు, కూలీలు పనిచేస్తున్నారని, ఇన్ని వేల మంది పనిచేస్తుంటే పోలవరం సినిమా చూపిస్తున్నారని మాట్లాడటానికి వైసీపీ నేత జగన్మోహన్ రెడ్డికి నోరెలావచ్చిందని ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. గురువారంనాడు మంత్రి ఉమా జలవనరుల శాఖ విడిది కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ, పోలవరం ప్రాజెక్టుపై ఏ మాత్రం అవగాహన లేని జగన్ మాట్లాడుతుంటే విడ్దూరంగా ఉందని, ఈ నెల రోజుల్లోనే పోలవరం ప్రాజెక్టును 22వేల మంది రైతులు సందర్శించారు. కొన్ని వందలమంది పోలవరం డ్యామ్ సైట్ కు వెళ్లి ఆనందంగా తిరిగొస్తూ సీఎంను ప్రశంసిస్తున్నారని అన్నారు. రూ.8619 కోట్లు డ్యామ్ సైట్ లో ఖర్చుపెట్టి పెద్ద ఎత్తున పనులు జరుగుతుంటే సినిమా చూపిస్తున్నారని మాట్లాడటం ఏ మాత్రం సబబో జగనే చెప్పాలన్నారు. రూ.24వేల కోట్లతో అమరావతి పనులు జరుగుతుంటే.. అమరావతిని భ్రమరావతి అని ఎద్దేవా చేస్తావా? పోలవరం సినిమా చూపిస్తున్నామని జగన్, విజయసాయిరెడ్డి, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి మాట్లాడుతున్నారు. సొమ్ము మాది.. సోకు మీదని కన్నా లక్ష్మినారాయణ అంటారని, ఒక ఎమ్మెల్యే, ఒక ఎంపీ సీటిస్తే మా పార్టీలోకి వచ్చేవాడు వీళ్లా మమ్మల్ని విమర్శించేదన్నారు. వైసీపీ, బీజేపీ, జనసేన పార్టీల అజెండా ఒక్కటే.. కేంద్ర ప్రభుత్వం డైరెక్షన్ లో పనిచేయడమే వారి పనని అభివర్ణించారు._

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here