ఆరోగ్య‌భ‌ద్ర‌త విష‌యంలో తిరుమ‌ల భేష్ : మంత్రి

116

భారత్ దేశంలోని ఆలయాల్లో ఎక్క‌డ‌లేని విధంగా తిరుమ‌ల శ్రీ‌వారి ద‌ర్శ‌నానికి విచ్చేసే భ‌క్తుల‌ ఆరోగ్య భ‌ద్ర‌త‌కు టిటిడి ప‌టిష్ఠమైన ప‌రిశుభ్ర‌త‌ చ‌ర్య‌లు చేపట్టిన‌ట్లు గౌ.రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి శ్రీ వెల్లంప‌ల్లి శ్రీ‌నివాసులు ఉద్ఘాటించారు.శుక్ర‌వారం ఉద‌యం తిరుమ‌ల శ్రీ‌వారి ద‌ర్శ‌నానంత‌రం ఆయ‌న  అద‌న‌పు ఈవో శ్రీ ఏ.వి.ధ‌ర్మారెడ్డితో క‌లిసి వైకుంఠ క్యూకాంప్లెక్్స‌, క‌ల్యాణ క‌ట్ట‌, మాతృశ్రీ త‌రింగొండ వెంగ‌మాంబ అన్న‌ప్ర‌సాద భ‌వ‌నాలను ప‌రిశీంచారు.  ఈ సంద‌ర్భంగా  గౌ.మంత్రి వ‌ర్యులు మీడియాతో మాట్లాడుతూ గౌ.ముఖ్య‌మంత్రి వ‌ర్యులు శ్రీ వై.ఎస్‌.జ‌గ‌న్‌మోహ‌న్ రెడ్డి ఆదేశాల మేర‌కు తిరుమ‌ల‌కు విచ్చేసే ప్ర‌తి భ‌క్తుడికి సౌక‌ర్య‌వంతంగా, ప‌రిశుభ్ర‌మైన వాత‌వార‌ణంలో శ్రీ‌వారి ద‌ర్శ‌నాని క‌ల్పించేందుకు టిటిడి ఛైర్మ‌న్ శ్రీ వై.వి.సుబ్బారెడ్డి ఆధ్వ‌ర్యంలో విస్తృత ఏర్పాట్లు చేసిన‌ట్లు తెలిపారు. ప్ర‌పంచ వ్యాప్తంగా క‌రోనా వైర‌స్ వ్యాప్తి చెందుతున్న నేప‌థ్యంలో  కేంద్ర ప్ర‌భుత్వ సూచ‌న‌ల మేర‌కు అదన‌పు ఈవో శ్రీ ఏ.వి.ధ‌ర్మారెడ్డి ప్ర‌త్య‌క్షంగా నిరంత‌ర ప‌ర్యవేక్ష‌ణ‌లో  స్వామివారి ద‌ర్శ‌నానికి విచ్చేసే భ‌క్తులు మాస్కులు త‌ప్ప‌నిస‌రిగా ధ‌‌రించి, చేతులు శుభ్రం చేసుకు‌ని‌, 2 మీట‌ర్లు బౌతిక దూరం పాటిస్తూ నిర్ణీత సంఖ్య‌లో శ్రీ‌వారిని ద‌ర్శించుకునేలా ఏర్పాట్లు చేసిన‌ట్లు తెలిపారు.ప్ర‌తి రోజు 12 వేలు ద‌ర్శ‌నం టోకెన్లు కేటాయించ‌గా 10 వేల మందికి పైగా భ‌క్తులు శ్రీ‌వారిని ద‌ర్శించుకుంటున్నారన్నారు. ఆల‌యం, క్యూలైన్లు, ర‌ద్ధీ ప్రాంతాల‌లో, వ‌స‌తి స‌ముదాయాలు, క‌ల్యాణ‌క‌ట్ట‌, అన్న ప్ర‌సాద భ‌వ‌నం వ‌ద్ద‌ నిర్ణీత స‌మ‌యంలో శానిటైజ్ చేస్తున్నార‌న్నారు.అదేవిధంగా క‌ల్యాణ క‌ట్ట‌లో అవ‌స‌ర‌మైన జాగ్ర‌త్త‌లు పాటిస్తూ క్షుర‌కులు త‌ల‌నీలాలు తీస్తున్నార‌ని, అన్న‌ప్ర‌సాద భ‌వ‌నంలో 1000 మంది భోజ‌నం చేసే హాలులో 200 మందికి మాత్ర‌మే అన్న‌ప్ర‌సాదాలు వ‌డ్డిస్తున్న‌ట్లు వివ‌రించారు.తిరుమ‌ల‌లోనే కాక టిటిడి అనుబంధ ఆల‌యాల‌లోను ప‌టిష్టమైన ప‌రిశుభ్ర‌త ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ‌తిరుమ‌ల‌లో భ‌క్తులకు సౌక‌ర్యాలు క‌ల్పించేందుకు దాత‌లు అధిక సంఖ్య‌లో ముందుకు వ‌స్తు‌న్నార‌న్నారు.ఈ సంద‌ర్భంగా ఆయ‌న  దేశ వ్యాప్తంగా వివిధ ప్రాంతాల ‌నుండి వ‌చ్చిన భ‌క్తులను టిటిడి అందిస్తున్న ఏర్పాట్లు అడిగి తెలుసుకున్నారు.టిటిడి అందిస్తున్న సౌక‌ర్యాలు, క‌రోనా వైర‌స్ వ్యాప్తి నివార‌ణ చ‌ర్య‌ల‌పై వారు సంతృప్తి వ్య‌క్తం చేశారు.  గౌ.ముఖ్య‌మంత్రి వ‌ర్యులు దేవాల‌యాల ప‌విత్ర‌త‌, దేవాల‌యాల ప‌రిశుభ్ర‌త‌, భ‌క్తుల మ‌నోభావాలు దెబ్బ‌తిన‌కుండా చ‌ర్య‌లు చేప‌ట్టా‌ల‌ని ఆదేశించిన‌ట్లు తెలిపారు. ఇటీవ‌ల స‌ప్త‌గిరి మాస ప‌త్రిక బ‌ట్వాడ సంద‌ర్బంగా గుంటూరుకు చెందిన ఒక పాఠ‌కుడికి స‌ప్త‌గిరితో పాటు అన్య‌మ‌తానికి చెందిన మ‌రో పుస్త‌కం బ‌ట్వాడా అయిన‌ట్లు మాదృష్టికి వ‌చ్చింద‌న్నారు. టిటిడి ప్ర‌తిష్ట‌ను దెబ్బ తీయ‌డానికి కొంత మంది చేసిన దురుద్యేశ చ‌ర్య‌గా భావిస్తూ పోలీసుల‌కు ఫిర్యాదు చేయ‌డం జ‌రిగింద‌న్నారు. కాగా, అంత‌కుముందు గౌ.మంత్రివ‌ర్యులు నాద‌నీరాజ‌నం వేదిక‌పై జ‌రిగిన సుంద‌ర‌కాండ పారాయ‌ణంలో పాల్గొన్నారు. ఈ కార్య‌క్ర‌మంలో డెప్యూటీ ఈవోలు శ్రీ హ‌రీంద్ర‌నాథ్‌, శ్రీ నాగ‌రాజ‌, శ్రీ బాలాజి, ఆరోగ్య శాఖ అధికారి డా.ఆర్‌.ఆర్‌.రెడ్డి, విజివో శ్రీ మ‌నోహ‌ర్ ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here