ఆమరణదీక్షపై వామపక్ష నేతలతో పవన్‌కల్యాణ్ భేటీ

జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌తో వామపక్ష పార్టీల నేతలు బుధవారం భేటీ అయ్యారు. విజయవాడలోని జనసేన కార్యాలయంలో వీరు భేటీ అయ్యారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు తదితరులు సమావేశమయ్యారు. ఈ సందర్బంగా ఆమరణదీక్ష చేపట్టడంపై వామపక్ష నేతలతో పవన్‌కల్యాణ్ చర్చించారు. అంతేగాక జేఎఫ్‌సీ నివేదిక, ఢిల్లీ పరిణామాలపై కూడా వీరు చర్చించినట్లు సమాచారం. ఇదిలా ఉండగా… మంగళగిరిలో గత నెలలో జరిగిన జనసేన ఆవిర్భావ సభలో ఏపీకి ప్రత్యేక హోదా కోసం ఆమరణ దీక్షకైనా సిద్ధమేనని పవన్ కల్యాణ్ ప్రకటించిన సంగతి తెలిసిందే.

కాగా… మే నెల తర్వాత పవన్ ఆమరణ దీక్షకు దిగే అవకాశాలున్నాయని తాజా పరిస్థితులను బట్టి తెలుస్తోంది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *