ఆడియో న్యూస్: జూలై16న 'చుట్టాలబ్బాయి' పాటలు విడుదల

CHUTTALABBAYI (15)

లవ్‌లీ రాక్‌స్టార్‌ ఆది హీరోగా శ్రీ ఐశ్వర్యలక్ష్మీ మూవీస్‌, ఎస్‌.ఆర్‌.టి. మూవీ హౌస్‌ పతాకాలపై వీరభద్రమ్‌ దర్శకత్వంలో వెంకట్‌ తలారి, రామ్‌ తాళ్ళూరి నిర్మిస్తున్న ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ ‘చుట్టాలబ్బాయి’. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని జూలై 22న వరల్డ్‌వైడ్‌గా రిలీజ్‌కి సిద్ధమవుతోంది. కాగా, ఈ చిత్రం ఆడియోను జూలై 16 చాలా గ్రాండ్‌గా రిలీజ్‌ చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ ఆడియో ఫంక్షన్‌కి తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ మినిస్టర్‌ తలసాని శ్రీనివాస యాదవ్‌ ముఖ్యఅతిథిగా హాజరు కానున్నారు. ఇంకా తెలుగు చలన చిత్ర పరిశ్రమకు చెందిన ఎందరో సెలబ్రిటీస్‌ ఈ కార్యక్రమంలో పాల్గొంటారు.
లవ్‌లీ రాక్‌స్టార్‌ ఆది, నమిత ప్రమోద్‌, బ్రహ్మానందం, పోసాని కృష్ణమురళి, పృథ్వి, రఘుబాబు, కృష్ణభగవాన్‌, అభిమన్యు సింగ్‌, జీవా, సురేఖావాణి, షకలక శంకర్‌, చమ్మక్‌ చంద్ర, రచ్చ రవి, గిరిధర్‌, అనితనాథ్‌ దితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: ఎస్‌.ఎస్‌.థమన్‌, సినిమాటోగ్రఫీ: ఎస్‌.అరుణ్‌కుమార్‌, ఆర్ట్‌: నాగేంద్ర, ఎడిటింగ్‌: ఎస్‌.ఆర్‌.శేఖర్‌, మాటలు: భవాని ప్రసాద్‌, స్టిల్స్‌: గుణకర్‌, నిర్మాతలు: వెంకట్‌ తలారి, రాము తాళ్ళూరి, కథ,స్క్రీన్‌ప్లే,దర్శకత్వం: వీరభద్రమ్‌.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *