ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా ఐదు పాస్‌పోర్టు సేవాకేంద్రాలు

11

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో కొత్తగా ఐదు పాస్‌పోర్టు సేవాకేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు ప్రాంతీయ పాస్‌పోర్టు అధికారి డీఎస్ఎస్ శ్రీనివాసరావు వెల్లడించారు. ఇప్పటికే నెల్లూరు, కడప, కర్నూల్ లో పాస్‌పోర్టు సేవాకేంద్రాలుండగా కొత్తగా మరో ఐదు కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్ల శ్రీనివాసరావు పేర్కొన్నారు. విజయవాడలో త్వరలో ప్రాంతీయ పాస్‌పోర్టు కార్యాలయం ఏర్పాటు చేస్తామని ఆయన చెప్పారు. దీంతోపాటు గుంటూరు, ఒంగోలు, చిత్తూరు, అనంతపూర్, విజయవాడ లలో మరో రెండునెలల్లో పాస్‌పోర్టు సేవాకేంద్రాలు ఏర్పాటు చేస్తామని ఆయన వివరించారు. పాస్‌పోర్టు సేవలను ప్రజల ముంగిటకు తీసుకువచ్చేందుకు వీలుగా మార్చి నెలాఖరులోగా విజయవాడలో ప్రాంతీయ పాస్‌పోర్టు ప్రాంతీయ కార్యాలయాన్ని ఏర్పాటు చేస్తామని ప్రాంతీయ పాస్‌పోర్టు అధికారి వివరించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here