అహంకార కేంద్రానికి ప్రజలే బుద్ధి చెబుతారు- ఎంపీ రామ్మోహన్‌

13

రాష్ట్రంపై కేంద్రం కక్షసాధిస్తున్నట్లు మరోసారి రుజువైందని టీడీపీ శ్రీకాకుళం ఎంపీ కింజరాపు రామ్మోహన్‌నాయుడు అన్నారు.మిగులు బడ్జెట్‌తో ఏర్పడిన తెలంగాణ రాష్ట్రానికి ఆగమేఘాలపై పెండింగ్‌లో ఉన్న రూ.450 కోట్లు విడుదల చేసిందని.. కానీ మనకు రావలసిన రూ.350 కోట్లు మాత్రం విడుదల చేయలేదని ఆక్షేపించారు.రాష్ట్ర బీజేపీ నేతలు దీనిని గమనిస్తున్నారా అని ప్రశ్నించారు.ఆంధ్ర ప్రజలు చేసిన తప్పేంటో కేంద్రం చెప్పాలని డిమాండ్‌ చేశారు.‘రాష్ట్ర ప్రజలకు కేంద్రం చేస్తున్న అన్యాయంపై వైసీపీ, జనసేన పార్టీ నాయకులు ఎందుకు మౌనంగా ఉండిపోయారు..? రాష్ట్రంపై దొంగ ప్రేమ కురిపిస్తున్న ప్రతిపక్ష నేత జగన్‌ చిత్తశుద్ధి ఎక్కడికి పోయింది..? కన్నతల్లిలాంటి రాష్ట్రానికి అన్యాయం చేస్తుంటే ఎందుకు ప్రతిఘటించడం లేదు…? విభజన చట్టంలో వెనుకబడిన జిల్లాలకు కేంద్రం నిధులివాల్సి ఉన్నా.. ఇవ్వకపోవడం పార్లమెంటును అవమానించడం కాదా..? కేంద్రం చర్యలు ముమ్మాటికీ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమే.ఈ చర్యల్ని టీడీపీతో పాటు రాష్ట్రంలోని ప్రజలు ముక్తకంఠంతో ఖండిస్తున్నారు.అధికార దర్పంతో, అహంకారంతో కొట్టుమిట్టాడుతున్న కేంద్రానికి బుద్ధి చెప్పే రోజులు రాబోతున్నాయి.హక్కులను సాధించేవరకు టీడీపీ పోరాడుతూనే ఉంటుంది’ అని స్పష్టం చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here