అసెంబ్లీలో ప్రజా సమస్యలపై లోతుగా చర్చించాలి- చీఫ్ విప్ పల్లె

21

మార్చి 5 నుంచి ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశాల్లో ప్రజా సమస్యలపై లోతుగా చర్చించాలని…రాష్ట్రంలో నెలకొన్న కరువు, తాగునీరు, రోడ్లు, విభజన చట్టంలో కేంద్రం నెరవేర్చాల్సిన హామీలు, ప్రత్యేక హోదా వంటి అంశాలపై ప్రజలకు, ప్రతిపక్ష సభ్యులుకు ధీటుగా సమాధానం చెప్పాలన్నారు. అసెంబ్లీలో జరిగిన స్ట్రాటజీ మీటింగ్లో మండలి, శాసనసభ విప్పులతో పల్లె సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహం పై చర్చించారు. అధికారులు కూడా అన్ని శాఖల అభివృద్ధి, ప్రగతి నివేదికను సిద్ధం చేయాలని ఆదేశించారు. చర్చకు వచ్చే అంశాలపై శాఖల వారిగా నివేదికను సిద్ధం చేసే బాధ్యత ను విప్పులకు అప్పగించారు. సమావేశాలకు ఎమ్యెల్యేలందరు హాజరయ్యేలా చూస్తామన్నారు. శాఖల వారిగా నివేదికలు తయారు చేసుకున్న తరువాత సీఎం చంద్రబాబు నాయుడు తో సమావేశమై సలహాలు సూచనలు తీసుకుంటామని చీఫ్ విప్ పల్లె రఘునాథరెడ్డి తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here