అవినీతి ఖాకీల పై నెల్లూరు ఎస్పీ నిఘా…గీత దాటితే వేటు!

41

నెల్లూరు జిల్లా చరిత్రలో గతంలో ఎన్నడూ లేని విదంగా ఇప్పుడు పోలీస్ డిపార్ట్‌మెంట్ లో సిబ్బంది పనితీరులో మార్పు వస్తోంది… గత కొంత కాలంగా అవినీతికి మారుపేరులా తయారైన నెల్లూరు జిల్లా పోలీసు డిపార్ట్మెంట్ ను దారిలో పెట్టేందుకు కఠినంగా వ్యవహరిస్తున్నారు ప్రస్తుత ఎస్పీ రామకృష్ణ…జిల్లాకు వచ్చీ రాగానే సిబ్బంది పనితీరు పై నిఘా పెట్టి అవినీతి ఆరోపణలు ఉన్న అధికారులను సస్పెన్షన్ చేశారు.ఖాకీ వనంలో కలుపుమొక్కలను ఏరివేస్తున్నారు…జిల్లా ఎస్పీగా చార్జ్ తీసుకున్న దగ్గర నుండి అతికొద్ది సమయంలోనే అవినీతి అక్రమాలకుపాల్పడిన 6 గురు సీఐలు,5 మంది ఎస్సైలు ,20మంది కానిస్టేబుల్లను సస్పెండ్ చేశారు.ఏకంగా 40 మంది కానిస్టేబుల్లను వీఆర్ కి పంపించారు.ఎస్పీ ,పి హెచ్ డి రామకృష్ణ ఇప్పటికే 2 డీఎస్పీలను సరెండర్ చేశారు. ఆరోపణలు వచ్చిన వెంటనే వారిని పక్కన పెట్టేయడంలో ఎస్పీ ఏమాత్రం ఆలస్యం చేయడం లేదు. నేరస్తులకే కాకుండా అవినీతి ఖాకీలకు కూడా జిల్లాలో సింహస్వప్నంలా మారారు…ఎస్పీ దృష్టి కి అక్రమాలు భయటపడగానే కొందరు అదికారులు భయపడి సెలవులపై వెళ్ళరు. సెలవు పై వెళ్లిన వారు తిరిగి డ్యూటీలో జాయిన్ అయిన వెంటనే సస్పెండ్ చేసి చర్యలు తీసుకుంటున్నారు…అవినీతి అక్రమాలకు పాల్పడిన ఏ ఒక్కరినీ తప్పించుకోవడానికి అవకాశం లేకుండా నిఘా పెట్టి డిపార్ట్మెంట్ లో తప్పులు జరగకుండా గాడిలో పెడుతున్నారు. గతంలో గుంటూరులో పనిచేసిన రామకృష్ణ ప్రజలకు జవాబుదారీ విధులు నిర్వహించటంతో పాటు అక్కడ వేళ్లూనుకుపోయిన ఇసుక మాఫియా కోరలు పీకి మాపియా కార్యకలాపాలు కట్డడిచేశారు. ఇసుక మాఫియా నుంచి లంచాలు తీసుకుంటున్న పోలీసు అదికారులు…సిబ్బంది పై వేటు వేశారు.అప్పట్లో రామకృష్ణ పేరు రాజధాని జిల్లా గుంటూరులో మారుమోగింది.అనంతరం కడప జిల్లా యస్పీ గా వెళ్లి అక్కడ ఫ్యాక్షనిజం జూలు కత్తిరిచారు.ఎర్రచెందనం స్మగ్లర్ ల భరతం పట్టారు.ఎర్ర చెందనం స్మగ్లర్లతో సంబందాలు ఉన్బ డియస్పీ స్తాయి అదికారులతో పాటు అవినీతి సిఐలు,సిబ్బంది పై చర్యలు తీసికున్న ఘటనలు రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపాయి…ఇక నెల్లూరు జిల్లాలో నూ ప్రజలకు శాంతి భద్రతలు కల్పించటంలో తీసుకునే శ్రద్ద తో పాటు డిపార్ట్మెంట్ లో తప్పుచేసిన అధికారులు, సిబ్బంది పైనా చర్యలు షురూ చేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here