అర్హులైన పేదలందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలి;సీపీఐ

54

కడప జిల్లా గాలివీడు మండలం లో ఆక్రమణకు గురయిన ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకుని అర్హులైన పేదలకు ఇండ్ల స్థలాలు కేటాయించాలని భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ) జిల్లా కార్యదర్శి జి. ఈశ్వరయ్య డిమాండ్ చేశారు గురువారం గాలివీడు మండలం లోని ఇండ్లు లేని పేదలతో కలెక్టరేట్ వద్ద ఆందోళన చేయడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 2008 సంవత్సరంలో లో మాజీ సైనికులకు, చేనేత కార్మికులకు, వికలాంగులకు ఇళ్ల పట్టాలు ఇవ్వడం జరిగిందని అయితే పట్టాలు ఇచ్చి స్థలం ఇంతవరకు చూపించలేదని ఆవేదన వ్యక్తం చేశారు పేదలంటే ఈ ప్రభుత్వానికి ఎందుకు అంత అలుసు అని ప్రభుత్వాన్ని ,అధికారులను నిలదీసి అడిగారు గాలివీడు మండలం లోని గాలివీడు తో పాటు నరసన్నపేట, గొరాన్ చెరువు కుమ్మర పల్లె , కరిమి రెడ్డి గారి పల్లె గ్రామాల్లోని ప్రభుత్వ భూమిని, వంక పోరంబోకు భూమిని స్మశాన వాటిక కు కేటాయించిన భూమిని ఉర్దూ పాఠశాల కేటాయించిన భూమిని ప్రభుత్వ భూమి ఎక్కడ కనిపిస్తే అక్కడ భూ కబ్జా దారులు చేరి భూమిని ఆక్రమించుకోవడం జరిగిందని ఇంత భూమి ఆక్రమణకు గురవుతున్నాయి రెవెన్యూ అధికారులు చూసిచూడనట్లు పట్టీపట్టనట్లు వ్యవహరించటం లో ఆంతర్యమేమిటని ఇందులో ఏ అధికారి కి ఎంత వాట అందిందో తెలియాల్సి ఉందని అన్నారు ఇంటి స్థలం ఇల్లు లేని పేదలు గుడిసెలు వేస్తే గుడిసెలను భూ కబ్జాదారులు వచ్చి కాల్చివేయడం ఏమిటని ప్రశ్నించారు రు టిడిపి కి చెందిన వారు ఉన్నారని రాజకీయ నాయకులతోపాటు రెవెన్యూ అధికారులు కూడా భూమిని వారి బంధువుల పేరుతో ఇష్టానుసారంగా ఆక్రమించుకొని పట్టాలు తెప్పించుకున్నారని అన్నారు ఆక్రమణకు గురైన ప్రభుత్వ భూమిని వెంటనే ప్రభుత్వం స్వాధీనం చేసుకొని అర్హులైన పేద ప్రజలకు స్థలం కేటాయించాలని డిమాండ్ చేశారు సర్వే నెంబరు 1127,1141,1435,852,1867,867,3884,1758,1751 గల భూమి మొత్తం ఆక్రమణకు గురైందని ఆక్రమించిన భూ కబ్జా దారులపై క్రిమినల్ కేసులు పెట్టాలని ఈ భూమిని ప్రభుత్వం వెంటనే స్వాధీనం చేసుకోవాలని అర్హులైన పేదలకు, 2008 సంవత్సరంలో మాజీ సైనికులకు ,చేనేత కార్మికులకు, వికలాంగులకు ఇచ్చిన పట్టాల కు స్థలాన్ని కేటాయించి నిర్మించాలని డిమాండ్ చేశారు

ఈ ఆందోళన కార్యక్రమం దాదాపు మూడు గంటల పాటు ఎర్రటి ఎండలో లో ఆకలిమంటల తో మండిపోతూ మూడు గంటలపాటు ఆందోళన చేస్తే జిల్లా కలెక్టర్ అధికారులు ఒక నిమిషం వచ్చి విషయం తెలుసుకోకుండా నిర్లక్ష్యం చేయడం పోలీసుల పహారా లో వెళ్లిపోవడం జరిగిందని పేదల పేదలంటే అధికారులకు ఎందుకు ఆయన ఆవేదన వ్యక్తం చేశారు రాష్ట్ర ముఖ్యమంత్రి, రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి, జిల్లా కలెక్టర్ గారికి వినతులు మెయిల్ ద్వారా పంపడం జరిగింది రెవెన్యూ అధికారులు కబ్జాదారులకు కొమ్ముకాస్తున్నారని కాసులకు కక్కుర్తి పడి వాళ్ల ఆక్రమాలకు సహకరిస్తున్నారని అన్నారు ఆక్రమణకు గురైన భూమి పై విచారణ కమిటీ వేసి వెంటనే ప్రభుత్వం స్వాధీనం చేసుకోకపోతే ఆందోళన ఉధృతంగా మారుతుందని హెచ్చరించారు ఈ అందోళన కార్యక్రమంలో లో సీపీఐ రాయచోటి ఏరియా కార్యదర్శి విశ్వనాథ్, సిపిఐ జిల్లా సమితి సభ్యులు ఎస్. శ్రీనివాసులు చేనేత కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు వీర భాస్కర్, సిపిఐ నగర కార్యదర్శి ఎన్. వెంకట శివ, కేసి బాదుల్లా, జి మద్దిలేటి , వి. గంగా సురేష్ ,కే మునయ్య పకీరయ్య, ఈశ్వరయ్య, కృష్ణ మూర్తి, రమణ, తదితరులు పాల్గొన్నారు

అభివందనములతో
జి. ఈశ్వరయ్య
సీపీఐ జిల్లా కార్యదర్శి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here