అమ‌రావ‌తిలో ఏపీఐఐసీ ట‌వ‌ర్స్-1 సిద్ధం!

155

న‌వ్యాంధ్ర రాజ‌ధాని అమ‌రావ‌తిలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న మంగ‌ళ‌గిరి అభివృద్ధి సోపానంలో మ‌రో మ‌ణిహారం చేరింది. ఆంధ్ర‌ప్ర‌దేశ్ పారిశ్రామిక మౌలిక స‌దుపాయాల క‌ల్ప‌న సంస్థ (ఏపీఐఐసీ) మంగ‌ళ‌గిరిలో ఏపీఐఐసీ ట‌వ‌ర్స్ బ‌హుళ అంత‌స్తుల భ‌వ‌నాల్లో ట‌వ‌ర్‌-1 ప్రారంభానికి సిద్ధ‌మైంది.  అత్యంత ఎత్తైన బ‌హుళ అంత‌స్తులు క‌లిగిన ఈ ట‌వ‌ర్స్ మంగ‌ళ‌గిరికే త‌ల‌మానికంగా నిలుస్తోంది.  2.26 ఎక‌రాల విస్తీర్ణంలో రూ.110 కోట్ల వ్య‌యంతో 11 అంత‌స్తుల స‌ర్వాంగ సుంద‌ర‌మైన భ‌వ‌నాన్ని అనేక ప్ర‌త్యేక‌త‌ల మేళ‌వింపుతో ఏపీఐఐసీ ఈ ట‌వ‌ర్స్‌ను అత్యంత వేగంగా నిర్మాణం పూర్తి చేసింది.

పారిశ్రామిక విభాగాల‌న్నీ ఒకే చోట‌ మంగ‌ళగిరిలోని ఏపీఐఐసీ ట‌వ‌ర్స్‌-1 భ‌వ‌నం నిర్మాణం పూర్తి కావ‌డంతో
ప‌రిశ్ర‌మ‌లు, పెట్టుబ‌డుల విభాగాల‌కు సంబంధించిన కార్యాల‌యాల‌న్నీ ఒకే గొడుకు కింద‌కు రానున్నాయి. ఇప్ప‌టిర‌కు ఈ విభాగాల కార్యాల‌యాల‌కు సొంత
భ‌వ‌నాలు లేక విజ‌య‌వాడ‌లో ప‌లు ప్రాంతాల్లో ఉండేవి. ఇప్పుడు ఏపీఐఐసీ ట‌వ‌ర్స్ – భ‌వ‌నం పూర్తి కావ‌డంతో ఇవ‌న్నీ ఈ భ‌వ‌నంలోకి మార‌నున్నాయి. దీనివ‌ల్ల ప‌రిశ్ర‌మ‌ల‌కు సంబంధించి, పెట్ట‌బడుల‌కు సంబంధించి అన్ని
కార్యాల‌యాలు ఒకే చోట ఉండ‌టంతో ప్ర‌జ‌ల‌కు ఎంతో సౌల‌భ్యం క‌ల‌గ‌నుంది. పెట్టుబుడులు పెట్ట‌డానికి ముందుకు వ‌చ్చేవారికి స‌ర్వేస‌మ‌స్త స‌మాచారం ఈ కార్యాల‌యంలో ల‌భించేలా కూడా ఏర్పాట్లు చేశారు.  ఏపీఐఐసీ, ప‌రిశ్ర‌మ‌ల
శాఖ క‌మిష‌న‌ర్‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఆర్థికాభివృద్ధి మండ‌లి (ఏపీఈడీబీ), ఏపీఐడీసీ మ‌రియు ఏపీ ఫైబ‌ర్‌నెట్ సంస్థ కార్యాల‌యాలు కూడా ఇందులో కొలువుదీర‌నున్నాయి.  దీంతో పాటు ఈ భ‌వ‌నంలో ఐఓటీ ఎగ్జిబిష‌న్
కేంద్రాన్ని కూడా ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ‌గా ఏర్పాటు చేశారు.  రాష్ట్రంలో పెట్టుబ‌డులు పెట్ట‌డానికి ముందుకొచ్చేవారి కోసం స‌ర్వే స‌మ‌స్త స‌మాచారం క్ష‌ణాల్లో ల‌భించేలా ఒక అంత‌స్తు మొత్తం దీనికే కేటాయించారు. ఈ
అంత‌స్తులోకి అడుగు పెట్ట‌గానే రాష్ట్రంలో పెట్ట‌బుడులు పెట్ట‌డానికి ఎలాంటి అనుకూల వాతావ‌ర‌ణం ఉంది, పెట్ట‌బుడుల ప్ర‌గ‌తి ఎలా ఉంది త‌దిత‌ర అనేక అంశాలు సంద‌ర్శ‌కుల‌కు తెలిసేలా అత్యాధునిక సాంకేతిక‌త‌ల
మేళ‌వింపుతో ఏర్పాటు చేశారు.  ఈ 11 అంత‌స్థుల భ‌వంతిలో ప్ర‌తి అంత‌స్తులోనూ ప్ర‌త్యేక‌త‌లు మేళ‌వించేలా నిర్మాణం చేప‌ట్టారు.

నేడు ముఖ్య‌మంత్రి చేతుల మీదుగా ప్రారంభం
ఏపీఐఐసీ మంగ‌ళ‌గిరిలో నూత‌నంగా నిర్మించిన ఏపీఐఐసీ ట‌వ‌ర్స్‌-1 భ‌వంతిని రాష్ట్ర ముఖ్య‌మంత్రి  శ్రీ నారా చంద్ర‌బాబు నాయుడుగారు శుక్ర‌వారం ప్రారంభించ‌నున్నారు. ఇందులో భాగంగా శుక్ర‌వారం సాయంత్రం 3.00 గంట‌ల‌కు ఈభ‌వ‌నం ప్రాంగ‌ణంలో భ‌వ‌న ప్రారంభోత్స‌వ కార్య‌క్ర‌మం ఏర్పాటు చేశారు. ఈ
కార్య‌క్ర‌మంలో రాష్ట్ర ఐటీ మ‌రియు పంచాయ‌తీరాజ్ శాఖామాత్యులు శ్రీ నారాలోకేష్‌,  ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి శ్రీ ఎన్‌.అమ‌ర‌నాథ‌రెడ్డి, పౌర‌స‌ర‌ఫ‌రాల శాఖ మంత్రి శ్రీ ప‌త్తిపాటి పుల్లారావు,  సాంఘిక సంక్షేమ
శాఖ మంత్రి శ్రీ న‌క్కా ఆనంద‌బాబు, ఏపీఐఐసీ ఛైర్మ‌న్ శ్రీ పి.
కృష్ణ‌య్య‌,  ప‌రిశ్ర‌మ‌ల శాఖ కార్య‌ద‌ర్శి శ్రీ సాల్మ‌న్ ఆరోఖ్య‌రాజ్‌, ఐఏఎస్‌,  ఏపీఐఐసీ వైస్ ఛైర్మ‌న్ & మేనేజింగ్ డైరెక్ట‌ర్ బాబు.ఏ, ఐఏఎస్‌, త‌దిత‌రులు పాల్గొంటారు.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here