అమ్మ వారికి దీక్షకు సిద్ధమవుతున్న పవన్

93

దసరా నవరాత్రుల నేపథ్యంలో జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ అమ్మవారి దీక్ష చేపట్టనున్నారు. దేవీ నవరాత్రులు ప్రారంభం కానున్న ఈ నెల 10న ఉదయం దేవీ పూజ చేసిన అనంతరం దీక్షను స్వీకరించనున్నారు. తొమ్మిది రోజులపాటు కొనసాగనున్న ఈ దీక్షలో పవన్ పండ్లు, పాలను మాత్రమే ఆహారంగా స్వీకరిస్తారు.ఆదివారం పోలవరంలో పవన్ పార్టీ నాయకులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించారు. గతంలో పవన్ ప్రతి ఏడాది చాతుర్మాస దీక్ష చేసేవారు. ఇప్పుడు అమ్మవారి దీక్ష చేపట్టనున్నట్టు పవన్ తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here