అమరావతి లేకుంటే, రాష్ట్రం చీకట్లపాలే;ఆలపాటి రాజేంద్రప్రసాద్‌

71

5కోట్లమందికి అత్యావశ్యకమైన, రాష్ట్రఖ్యాతిని ప్రపంచస్థాయిలో ఇనుమడింపచేయగ ల, నవ్యాంధ్రను అభివృద్ధికి కేంద్రబిందువుగా మార్చగల రాజధాని అమరావతి నిర్మాణం తమ ప్రభుత్వానికి ప్రాధాన్యంకాదని, స్వయంగా ఆర్థికమంత్రే అనడం సిగ్గుచేటని, ఆయన వ్యాఖ్యలు వైసీపీప్రభుత్వ విధానాలకు, జగన్మోహన్‌రెడ్డి అసమర్థపాలనకు అద్దం పట్టాయని టీడీపీ సీనియర్‌నేత, మాజీమంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్‌ మండిపడ్డారు. శుక్రవారం ఆయన గుంటూరులోని పార్టీ రాష్ట్రకార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. నగరాలు నిర్మించలేమని, అమరావతి ముఖ్యంకాదని, నవరత్నాలే ముద్దని నోరుపారేసుకున్న బుగ్గన, తన వ్యాఖ్యలతో రాష్ట్ర భవిష్యత్‌ను చీకట్లపాలు చేశాడన్నారు. 34వేల ఎకరాలను, ప్రజల కలలరూపాన్ని అడుగడుగునా నిర్వీర్యం చేసేలా రాజేంద్రనాథ్‌రెడ్డి మాట్లాడాడన్నారు. రాష్ట్రప్రగతికోసం, భావితరాల భవిష్యత్‌ని కాంక్షించి అమరావతికి భూములిచ్చిన రైతుల ఆశల్ని, ఆశయాలను, వారిచ్చిన లక్షలకోట్ల ఆస్తిని కాలరాసేలా వైసీపీప్రభుత్వ నిర్ణయాలు, మంత్రుల మాటలు ఉండటం బాధాకరమన్నారు. ఒక మంత్రేమో అమరావతి ముంపునకు గురవుతుందంటే, మరొకాయన అక్కడ నిర్మాణవ్యయం పెరుగుతుందని దుష్ప్రచారం చేశాడన్నారు. ప్రజలకు మేలుచేయాలన్న ఆలోచన, వారినిఆదుకోవాలన్న తపన రాష్ట్రప్రభుత్వానికి లేవని మాజీమంత్రి స్పష్టంచేశారు. తనపదవిని కాపాడుకోవడానికి, జగన్‌మెప్పు పొందడానికే బుగ్గన స్పృహలేకుండా మాట్లాడాడన్నారు. అమరావతిని నిర్మిస్తే, చంద్రబాబుకి పరపతి, ప్రతిష్ట పెరుగుతాయన్న దుగ్ధతోనే, జగన్మోహన్‌రెడ్డి, ఆయన మంత్రులు రాజధానిపై విషం చిమ్ముతున్నారని ఆలపాటి దుయ్యబట్టారు. జగన్‌ ప్రభుత్వం వచ్చిన ఆరునెలల్లో రాజకీయహింస, ఆర్థిక హింస, సామాజిక హింస రాష్ట్రంలో పెచ్చుమీరా యని, ప్రపంచంలో ఎక్కడాలేని విధంగా రాష్ట్రంలో అభివృద్ధి నిలిచిపోయిందన్నారు.మంత్రు ల మాటలు రాష్ట్రప్రజల్ని భయభ్రాంతులకు గురిచేస్తున్నాయని, కులాలు, మతాల ప్రాతిపదిక న నీచాతినీచంగా వారు మాట్లాడుతున్నారన్నారు. నవరత్నాలే తమకు ముఖ్యమంటున్న ప్రభుత్వపెద్దలు, వాటి అమలుకోసం ప్రజల జీవితాలను, ప్రభుత్వ ఆస్తులను తాకట్టుపెడతా రా అని ఆలపాటి ప్రశ్నించారు. పీపీఏలపై సమీక్షలపేరుతో జగన్‌ ప్రభుత్వం ఏం సాధించిం దో సమాధానం చెప్పాలన్నారు. కేంద్రప్రభుత్వం, ఇంధనశాఖ చెప్పినా వినకుండా గుడ్డిగా ముందుకెళ్లిన జగన్‌ప్రభుత్వం చివరకు బొక్కబోర్లా పడిందన్నారు. కేంద్ర విదేశాంగశాఖను అప్రదిష్టపాలు చేసిందిగాక, పీపీలపై తమ ప్రభుత్వనిర్ణయాన్ని సమర్థించుకుంటూ, బుగ్గన మాట్లాడటం దౌర్భాగ్యమన్నారు. ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ నిధులను నిలిపివేసిన జగన్‌సర్కారు, ఉపాధిపనిచేసుకునే కూలీల పొట్టకొట్టిందన్నారు. కూలీల వేతనాలు చెల్లించకుండా, వారి కడుపులు కాలుస్తున్న ప్రభుత్వం, వీపునిమురుతూ వారిని అనునయించడానికి ప్రయత్నించడం సిగ్గుచేటన్నారు. పులివెందుల, పుంగనూరు నియోజకవర్గాలకు నిధులిచ్చి, మిగిలిన నియోజకవర్గాలను ముంచేయడమేనా బుగ్గన చెబుతున్న ప్రాధాన్యత అని టీడీపీ నేత నిలదీశారు. రూ.2,470కోట్ల ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ నిధుల్ని ఆపేసిన రాష్ట్రప్రభుత్వం, నవరత్నాల పేరుతో, గతప్రభుత్వ పథకాలను రద్దుచేసి, పేదలను మోసంచేసిందన్నారు. చంద్రబాబు పథకాలను ఆపేయడానికి ప్రయత్నిస్తున్న వైసీపీప్రభుత్వ అడ్రస్‌ త్వరలోనే గల్లంతవుతుందన్నారు. రైతుభరోసా పేరుతో రైతుకి, రూ.6వేలిస్తూ, వారిని అవమానించార ని, పింఛన్‌సొమ్ముని రూ.250పెంచి పింఛన్‌దారులను మోసంచేయడం, ఇసుక కృత్రిమ కొరతతో ప్రజలను ఇబ్బందులకు గురిచేయడమేనా బుగ్గన చెప్పేప్రాధాన్యత అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here