అమరావతికి రాష్ట్రపతి రాక

ఈనెల 7,8 తేదీల్లో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నవ్యాంధ్ర రాజదాని అమరావతిలో పర్యటించనున్నారు.

రాష్ట్రపతి పర్యటన షెడ్యూల్ వివరాలు.. 7న మధ్యాహ్నం 2.30 గంటలకు విశాఖ ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు.

అదేరోజు ఎయిర్ క్రాప్ట్ మ్యూజియంను ప్రారంభించనున్నారు. ఏయూలో ఈ-క్లాస్ రూం కాంప్లెక్స్ భవనానికి, ఇంక్యుబేషన్ సెంటర్‌కు శంకుస్థాపన చేయనున్నారు.

8వ తేదీన ఉదయం 8 గంటలకు ఐఎన్ఎస్ పరేడ్ గ్రౌండ్‌లో కలర్స్ ప్రజెంటేషన్ కార్యక్రమంలో పాల్గొంటారు.

ఉదయం 10.30 గంటలకు రాష్ట్రపతి కోవింద్ తిరిగి ఢిల్లీకి బయలుదేరుతారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *