అమరావతికి మైలవరం ముఖద్వారం!

23

ఆధికారులు, ప్రజా ప్రతినిధులతో పాటు నేను తప్పు చేసినా 1100 ద్వారా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఫిర్యాదు చెయ్యండి అని ఏపీ జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ప్రజలకు పిలుపునిచ్చారు. గురువారం కొటికలపూడి, కేతనకొండలలో జరిగిన ఇంటింటికీ తెలుగుదేశం పార్టీ కార్యక్రమంలో మంత్రి ఉమా ప్రసంగించారు. మైలవరం నియోజకవర్గంలో పెద్ద ఎత్తున సిమెంట్ రోడ్ల నిర్మాణం జరిగిందని, మేము వేసిన ఆ సిమెంట్ రోడ్లపై వైసీపీ నాయకులు గడప గడపకు కార్యక్రమం నిర్వహిస్తూ అభివృద్ధి జరగలేదని మట్లాడటం శోచనీయం అన్నారు. అలాంటి వారిని ప్రజలు నిగ్గదీసి జరిగిన అభివృద్ధిని చూపించి కళ్ళు తెరిపించాలని కోరారు. ప్రజారాజధాని అమరావతి కి మైలవరం నియోజకవర్గం ముఖద్వారమని ఇందుకు నియోజకవర్గ ప్రజలు చంద్రబాబు నాయుడు కు ఋణపడి ఉన్నారని తెలిపారు. చంద్రబాబు నాయుడు గారు ప్రతి సోమవారం పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కోసం కష్టిస్తుంటే విపక్ష నేత వైయస్ జగన్ ప్రతి శుక్రవారం అక్రమాస్తులు, అల్లిబిల్లి కంపెనీల కేసులలో న్యాయ మూర్తుల ఎదుట చేతులు కట్టుకుని నిలబడుతున్నట్లు వివరించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here