అభిషేక్ పిక్చర్స్ రిలీజ్ చేయనున్న ‘ఇంకొక్కడు’

69

unnamed (1)శివపుత్రుడు, అపరిచితుడు, నాన్న, ఐ వంటి విలక్షణమైన చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో తనదైన స్థానాన్ని ఏర్పరుచుకున్న హీరో చియాన్ విక్రమ్ నటిస్తున్న మరో ఎక్స్ పెరిమెంటల్ యాక్షన్ స్పై థ్రిల్లర్ `ఇంకొక్కడు`. నయనతార, నిత్యామీనన్ లు హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ చిత్రాన్ని తెలుగులో ఎన్.కె.ఆర్.ఫిలింస్ బ్యానర్ పై నీలం కృష్ణారెడ్డి సొంతం చేసుకొన్న విషయం తెలిసిందే. ఇప్పుడీ చిత్రం డిస్ట్రిబ్యూషన్ హక్కులను ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థ అభిషేక్ పిక్చర్స్ అధినేత అభిషేక్ నామా దక్కించుకొన్నారు.
ఈ సందర్భంగా చిత్ర నిర్మాత నీలం కృష్ణారెడ్డి మాట్లాడుతూ.. “తెలుగు ప్రేక్షకులకు క్వాలిటీతో కూడుకున్న చిత్రాలను అందించడమే మా బ్యానర్ లక్ష్యం. శిబుథమీన్స్ గారు, ఆనంద్ శంకర్ గారు కాంబినేషన్ లో భారీ బడ్జెట్, హై టెక్నికల్ వాల్యూస్, విజువల్ ఎఫెక్ట్స్ తో ఈ చిత్రం రూపొందుతోంది. విక్రమ్, నయనతార, నిత్యామీనన్ వంటి టాప్ స్టార్స్ తో పాటు మ్యూజిక్ డైరెక్టర్ గా హరీష్ జైరాజ్, సినిమాటోగ్రాఫర్ గా ఆర్.రాజశేఖర్, ఎడిటర్ గా భువన్ శ్రీనివాస్ వంటి టాప్ టెక్నిషియన్స్ ఈ చిత్రానికి పనిచేస్తున్నారు. ఇటీవల విడుదలైన ఆడియో మరియు ట్రైలర్ కు విశేషమైన ఆదరణ లభిస్తోంది. సెప్టెంబర్ రెండో వారంలో ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రం డిస్ట్రిబ్యూషన్ హక్కులను ఫ్యాన్సీ రేట్ కు అభిషేక్ పిక్చర్స్ సంస్థ దక్కించుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఈ చిత్రం ఘన విజయం సాధించి మా ఎన్.కె.ఆర్ సంస్థకు నిర్మాణ రంగంలో శుభారంభాన్నివ్వడంతోపాటు తెలుగు ప్రేక్షకులకు ఒక అద్వితీయమైన చిత్రాన్ని అందించామనే తృప్తిని కూడా మిగుల్చుటుందన్న పూర్తి నమ్మకం నాకుంది” అన్నారు!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here