అభివృద్ధి పనులపై అలసత్వం తగదు- మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్

70

దీర్ఘకాలికంగా ఉన్న ప్రజల సమస్యలను పరిష్కరించే విషయంలో అధికారులకు అలసత్వం తగదని, ప్రజలు మెచ్చే విదం గా పనిచేయాలని సూచించిన దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు.

నియోజక వర్గ పర్యటనలో బాగంగా మూడవ రోజు 32 వ డివిజన్ చిట్టి నగర్ సెంటర్ నుంచి పర్యటన ప్రారంభించారు. తెలుగుదేశం ప్రభుత్వం నియోజక వర్గ అభివృద్ది పై చిన్న చూపు చూపిందని ఈ ప్రాంతంలో రోడ్లు తాగునీరు సదుపాయం, విది దీపాలు ఎర్పాటు చెయ్యటం లో కూడా నిర్లక్ష్యం వహించందని కొండ ప్రాంతంలో అంతరాయం లేని నాణ్యమైన విద్యుత్ తాగు నీరు, కాలువల పూడికల తీసివేత కార్యక్రమం రోజుల్లో నే ప్రారంభిస్తామని తెలిపారు. అదేవిధంగా ఇసుక కొరతతో ప్రజలు పడుతున్న ఇబ్బందులను జిల్లా కలెక్టర్ తో మాట్లాడి త్వరలో పరిష్కరిస్తామన్నారు.

కటికెల వారి విది మస్తాన్ విది, పోతిన పాపాయమ్మ సందులలో పర్యటించిన మంత్రి కి స్థానికంగా ఉన్న కాలువలను మూసి వేస్తున్నారని దీనితో మురుగు రోడ్డు మీదకు వస్తుందని అంతర్గత రహదారుల తో పాటు తాగునీరు ఎర్పాటు చెయ్యాలని కోరారు. కొండ ప్రాంతంలో వర్షం వస్తె కొండ చర్యలు విరిగి పడుతున్నాయని, విది దీపాలు లేక రాత్రి పూట ఇబ్బంది పడుతున్నాం అని సమస్యలు తెలుసుకున్న మంత్రి సమస్యలను పరిష్కరించాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు.
బంగారయ్య కొట్టు కొండ ప్రాంతంలో డ్రైనేజీ సమస్య కారణం గా కాలువలో పూడికలు బాగా పేరుకు పోయాయని మంత్రి ద్రుష్టి కి తీసుకు వచ్చారు. ఈ ప్రాంతం లో కాలువల పూడికలు తీసివేత కార్యక్రమం వెంటనే చేపట్టాలని ఆంజనేయ వాగు సెంటర్ నుంచి చిట్టినగర్ సెంటర్ వరకూ ఉన్న మెయిన్ రోడ్డు కు ఇరువైపుల ఉన్న కాలువల్లో పూడికలు పేరుకు పోయి.. రోడ్డు కు సమాంతరంగా మురుగు నీరు ప్రవహిస్తోంది అది చూసిన మంత్రి వెలంపల్లి శ్రీనివాస రావు అధికారులను పిలిచి అధికారుల సమక్షం లో పూడికల తిత నగర పాలక సంస్థ సిబ్బంది చేసే పనిని స్వయంగా పరిశీలించారు.

కాలువల పూడికల పనులు నామ మాత్రపు పనులు కాకుండా ప్రజలు మెచ్చే విధంగా ఉండాలని కాలువ నీరు ప్రవిహించే విధానమే లేకపోతే వర్షపు నీరు వస్తె పరిస్థితి ఎంటి అని ప్రశ్నించారు. అంజనేయ వాగు సెంటర్ లో ఉన్న అర్బన్ హెల్త్ సెంటర్ కొండ పైన ఉన్న కారణం గా గర్భిణీలు, మహిళలు, వృద్దులు, చిన్నారులు ఇబ్బంది పడుతున్నారని అర్బన్ హెల్త్ సెంటర్ ను దిగువకు మార్చాలని స్థానికుల విన్నపాన్ని మంత్రి సానుకూలం గా స్పందించారు.
ఉగాది నాటికి ఇళ్ళ పట్టాల పంపిణీ ..
ఈ ప్రాంతంలో దీర్ఘకాలికంగా ఉన్న ఇళ్ళ పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని ఉగాది నాటికి పూర్తి చేస్తాం అని మంత్రి వెలంపల్లి తెలిపారు.
ఈ కార్యక్రమంలో నగర పాలక సంస్థ జోనల్ కమిషనర్ శ్రీనివాస్,ఈ.ఈ కోటేశ్వర రావు, శానిటరీ ఇన్స్పెక్టర్ కృష్ణ, ఎలక్ట్రిసిటీ ఎడి బాలాజీ మరియు సంబంధిత అధికారులతో పాటు రాష్ట్ర కార్యదర్శి మైలవరపు దుర్గా రావు,32 డివిజన్ అద్యక్షులు పిల్లా సూరి బాబు, అత్తులురి పెదబాబు, బాషా, మీరా హుస్సేన్, వరలక్ష్మి, వెన్నముద్దల శ్రీను, బడే, హుస్సేన్, కె. నాగు తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here