ఏపీ రాజకీయం మరీ శ్రుతిమించి రాగాన పడుతోంది. ఇది ఏ పార్టీకీ మంచిది కాదు. గతంలో చంద్రబాబు ప్రభుత్వం ఎలాంటి తప్పులు చేసిందో అంతకంటే ఎక్కువ తప్పులను జగన్ ప్రభుత్వం చేస్తోంది. అధికారం చేపట్టి ఆరు నెలలు గడిచినా అభివృద్ధి ఎక్కడి గొంగళి అక్కడే అన్నచందంగా ఉంది. గతంలో చంద్రబాబు ప్రభుత్వం కూడా అభివృద్ధి విషయంలో మీనమేషాలు లెక్కించి ఎన్నికలు దగ్గర పడగానే శంకుస్థాపనలు, శిలాఫలకాలు వేసి ప్రజల దృష్టిలో చులకనై అధికారాన్ని కోల్పోయింది. గత ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనులను కొత్త ప్రభుత్వం కొనసాగిస్తేనే పాలన సాఫీగా సాగుతుంది. వాటిని రద్దుచేసి మళ్లీ కొత్తవి ప్రారంభించేసరికి మళ్లీ ఎన్నికలు సమీపిస్తాయి. రాబోయే ప్రభుత్వం వీటికి కూడా బ్రేక్ వేస్తే ఏమవుతుంది? అభివృద్ధిని మరచిపోయి కేవలం ప్రజలకు ఏదోఒక రూపంలో డబ్బుల పంపిణీతో ముందుకు వెళ్లాలనుకోవడం సరికాదు. రాజకీయ నేతలపై కూడా ప్రజలకు ఏహ్యభావం కలుగుతోంది. ఎన్నికల తర్వాత కూడా ఈ జంపింగ్ జపాంగ్ లను చూస్తుంటే రాజకీయాలు ఎంతగా దిగజారాయో ప్రజలకు అర్ధమవుతోంది. ఇది నేననుకుంటున్న అభిప్రాయం. మేరేమనుకుంటున్నారో చెబితే నేను నా అభిప్రాయాన్ని మార్చుకుంటా. రద్దులు లేకుండా కేబినెట్ మీటింగులు జరపడం ప్రభుత్వా నికి ఇష్టం లేదేమో.
సీనియర్ జర్నలిస్ట్ విశ్లేషణ
హేమ సుందర్