అభిమాని కోరిక తీర్చిన ఎన్టీఆర్‌

సాధారణంగా ప్రజలు తమ అభిమాన తారలతో ఒక్కసారైనా మాట్లాడాలని కోరుకుంటారు. మరణానికి చేరువైన వారిలో కొందరి చివరి కోరిక తమ అభిమాన నటీ నటులను కలసి, మాట్లాడాలని చెబుతుంటారు. కొందరు నటులు అభిమానుల చివరి కోరిక తీరుస్తుంటారు. అలాంటివారిలో తాజాగా జూనియర్‌ ఎన్టీఆర్‌ కూడా చేరిపోయారు. ఎన్టీఆర్‌ ఈరోజు బెంగళూరులోని ఆయన అభిమాని నాగార్జున అనే కాన్సర్‌ పేషేంట్‌ను కలిసారు. నాగార్జున గత కొన్ని నెలలుగా క్యాన్సన్‌తో బాధపడుతున్నాడు. దీంతో ఇప్పుడు ఆయన చివరి దశకు చేరుకోవడంతో ఆయన చివరి కోరికగా ఎన్టీఆర్‌ను కలవలనుకున్నాడు. దీంతో ఎన్టీఆర్‌ స్వయంగా నాగార్జున దగ్గరకు ఈ రోజు వెళ్లి నాగార్జునను పరమర్శించాడు. ఆయనతో కొద్ది సేపు ముచ్చటించారు.FB_IMG_1469872683533 FB_IMG_1469872677632 FB_IMG_1469872569597 FB_IMG_1469872565996 FB_IMG_1469872563344 FB_IMG_1469872560382

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *