'అభినేత్రి' ఓవర్సీస్‌ రైట్స్‌ తీసుకున్న కోన వెంకట్‌ 

47
Kona-Venkat.
తెలుగు, తమిళ్‌, హిందీ భాషల్లో 70 కోట్ల భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ‘అభినేత్రి’ తెలుగు వెర్షన్‌ ఓవర్సీస్‌ రైట్స్‌ని భారీ ఆఫర్‌ ఇచ్చి 9 పిఎం ఎంటర్‌టైన్‌మెంట్‌ సంస్థ స్వంతం చేసుకుంది. తెలుగు ఓవర్సీస్‌ రైట్స్‌తో పాటు తమిళ్‌ వెర్షన్‌ ఓవర్సీస్‌ రైట్స్‌ని కూడా పెద్ద మొత్తం ఆఫర్‌ ఇచ్చి 9 పిఎం ఎంటర్‌టైన్‌మెంట్‌ సంస్థ దక్కించుకుంది. ‘అభినేత్రి’ చిత్రానికి డైలాగ్స్‌ రాసి.. ఈ చిత్రాన్ని కోన ఫిలిం కార్పొరేషన్‌ సమర్పణలో ఎం.వి.వి. సత్యనారాయణ  బ్లూ సర్కిల్‌ కార్పొరేషన్‌, బి.ఎల్‌.ఎన్‌. సినిమాతో కలిసి నిర్మాతగా తెలుగులో అందిస్తున్నారు కోన వెంకట్‌. ‘అభినేత్రి’ సినిమా విజయంపై గట్టి నమ్మకం వున్న కోన వెంకట్‌ ‘అభినేత్రి’ తెలుగు, తమిళ్‌ ఓవర్సీస్‌ డిస్ట్రిబ్యూషన్‌లో తాను కూడా షేర్‌ కలిసాడు. ఇంతకుముందు గుంటూరు జిల్లాలో ‘లౌక్యం’ చిత్రాన్ని డిస్ట్రిబ్యూట్‌ చేసి పంపిణీదారుడిగా కూడా ఘనవిజయాన్ని సాధించిన స్టార్‌ రైటర్‌ కోన వెంకట్‌ ‘అభినేత్రి’ ఓవర్సీస్‌ రైట్స్‌లో పార్టనర్‌గా కలిసారంటే ‘అభినేత్రి’ సక్సెస్‌పరంగా చాలా పెద్ద రేంజ్‌ హిట్‌ అవుతుందని ఎక్స్‌పెక్ట్‌ చెయ్యొచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here