అన్యాయం జరిగితే..ఆమరణ దీక్షకైనా సిద్ధం

109

pawan-kalyan-gunturఆంధ్రప్రదేశ్ కొత్త రాజధాని ప్రాంతంలో జనసేన పార్టీ అధ్యక్షుడు, సినీహీరో పవన్ కల్యాణ్ పర్యటన సందర్భంగా అక్కడి రైతులతో ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏపీ రాజధాని కోసం రైతులు స్వచ్ఛందంగా భూములు ఇస్తే సరే… బలవంతంగా భూములు తీసుకుంటే మాత్రం రైతుల కోసం ఆమరణ దీక్షకైనా సిద్ధమని ఆయన అన్నారు. భూసేకరణ చట్టం గురించి తనకు తెలియదని అయితే భూములు లాక్కుంటే మాత్రం పోరాడతానని తెలిపారు.
ఇప్పటి వరకు ఏపీకి కేంద్రం ప్రత్యేక హోదా ఇవ్వలేదన్న పవన్‌ సింగపూర్‌ లాంటి రాజధాని ఎప్పుడు పూర్తి అవుతుందని ప్రశ్నించారు. రుణమాఫీకి నిధులు ఎలా వస్తాయని నిలదీశారు. పెట్టుబడీదారి వ్యవస్థకు తాను వ్యతిరేకం కాదని ఆయన చెప్పారు. పెట్టుబడులు రావాలి…పరిశ్రమలు రావాలని పవన్‌ ఆకాంక్షించారు. ఐదేళ్ల తర్వాత న్యాయం చెస్తానని కొందరిలా చెప్పనన్న పవన్‌ ఇప్పటి నుంచే మీకు అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. రాజధానికి 33వేల ఎకరాలు అవసరమా అనేది పునరాలోచించాలని దీనిపై సీఎం చంద్రబాబు మాట్లాడుతానని ఆయన అన్నారు. అన్యాయం జరిగితే ప్రశ్నించడానికే జనసేన పార్టీ పెట్టానని సష్టం చేశారు. ఏపీ ప్రత్యేక హోదాపై కేంద్రంతో మాట్లాడతానని పవన్‌ కల్యాణ్‌ ప్రజలకు హామీ ఇచ్చారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here