అన్నా క్యాంటీన్ల పై క్లారిటీ ఇచ్చిన మంత్రి బొత్స

52

ప్రజలకు దూరంగా క్యాంటీన్లను టీడీపీ ప్రభుత్వం పెట్టింది. క్యాంటీన్లను ప్రజలకు దూరంగా కట్టారు ల్. ఎక్కడ స్థలం దొరికితే అక్కడ కట్టారు తప్ప ప్రజల అవసరాలను గుర్తించలేదు. క్యాంటీన్ల నిర్మాణాలపై రూ.50 కోట్ల బిల్లులు పెండింగ్‌లో పెట్టారు. ఆహారాన్ని అందించిన సంస్థకు రూ. 40 కోట్ల బిల్లులు ఇవ్వలేదు. క్యాంటీన్లకోసం ఒక్క పైసా ఇవ్వకుండా ఇప్పుడు మాపై విమర్శలు చేయడం సిగ్గుచేటు. భారీగా ప్రజాధనాన్ని వృథాచేశారు, ఎన్నికల ముందు హడావిడి చేశారు.

నిర్వహణలో పద్దతి లేదు ప్రజలకు అనుకూలంగా ఉండేలా ఆలోచనలు చేస్తున్నాం. ప్రభుత్వ క్యాంటీన్లపై ప్రతిపక్ష పార్టీ వ్యాఖ్యలను, ప్రచారాన్ని ఖండించిన పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఖండించారు. అతితక్కువ ధరలకు ఆహారాన్ని అందించడానికి ఉద్దేశించిన క్యాంటీన్లను ప్రజలకు మరింత ఉపయోగపడే రీతిలో తీర్చిదిద్దడానికి ప్రభుత్వం సంకల్పించిందని, వీటి నిర్వహణలో ఉన్న లోటుపాట్లని సరిదిద్దేలా చర్యలు తీసుకుంటున్నామని పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించారు.

క్యాంటీన్ల పనితీరుకు సంబంధించి గురువారం ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు. క్యాంటీన్లను మూసివేసే ఆలోచన లేదని ఆయన స్పష్టం చేశారు. ప్రజల అవసరాలు, స్థల లభ్యత, నిర్వహణ వెసులుబాటు వంటి అంశాలకు ప్రాధాన్యతనిస్తూ ప్రజలకు మరింత చేరువచేసే చర్యలు తీసుకుంటామన్నారు. పట్టణ ప్రాంతాల్లో గతంలో నిర్మించిన 182 అన్న క్యాంటీన్లలో చాలావరకు ఒక నిర్దిష్టమైన ప్రణాళిక లేకుండా, విధివిధానాలు లేకుండా ఏర్పాటు చేయడంతో వీటి ద్వారా ఆశించిన స్థాయిలో ఫలితాలు రావడం లేదని పేర్కొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here