అన్నయ్య మాట కాదని.. టీడీపీకి సపోర్ట్ చేశాను: పవన్

21

జనసేన అధినేత పవన్ కల్యాణ్.. టీడీపీ ప్రభుత్వంపై విమర్శల పరంపర కొనసాగిస్తూనే ఉన్నారు. గత ఎన్నికల్లో తానెంతగానో మద్దతిచ్చానో.. అంత బలమైన ప్రత్యర్థిని కూడా అన్నారు. విశాఖ తీరంలో జరిగిన జనసేన నిరసన కవాతులో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. గురువు, దైవం లాంటి అన్నయ్యను కాదని టీడీపీకి సపోర్ట్ చేశాను అన్నారు.ప్రచారంలో నిలబడ్డానని.. అండగా ఉన్నానన్నారు. కానీ ఇవాళ ఉత్తరాంధ్రను అడ్డగోలుగా దోచేస్తున్నారని మండిపడ్డారు. తాను మద్దతివ్వడమే కాదు.. బలమైన ప్రత్యర్థినని గుర్తు చేశారు. టీడీపీ వాళ్లు పోగొట్టుకోవడానికి వేలకోట్లు ఆస్తులు ఉన్నాయని.. తనకు ఒంటి మీద బట్టలు తప్ప వేరే ఏమీ లేవన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here