అనర్హత వేటు వేసే దమ్ముందా..ఆదిమూలపు సురేశ్‌

20

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నుంచి గెలిచి ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసే దమ్ముందా అని ఎమ్మెల్యే ఆదిమూలపు సురేశ్‌ ప్రశ్నించారు. ఫిరాయింపుదారులకు మంత్రి పదువులు ఇచ్చినందుకు నిరసనగా సభకు వెళ్లడం లేదన్నారు.చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడే పార్టీ ఫిరాయింపులను వ్యతిరేకిస్తున్నారని, మీ కోసం వస్తున్నా అంటూ పాదయాత్ర చేసిన్న చంద్రబాబు అలవెన్సులు తీసుకోలేదా అని ప్రశ్నించారు. ధ్వంద వైఖరి అవలంభించడం ఎంత వరకు కరెక్ట్‌ అని, పార్టీ ఫిరాయించిన 22 మంది ఎందుకు అనర్హత వేటు వేయడం లేదని నిలదీశారు. ఫిరాయింపుదారులపై అనర్హత వేటు వేసి, మంత్రులను బర్త్‌రఫ్‌ చేసిన ఉదయమే అసెంబ్లీకి వస్తామన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here