అనంతపురంలో హై అలర్ట్

41

202హైదరాబాద్‌లో విధ్వంసానికి కుట్ర పన్నిన ఉగ్రవాదులు రెండు నెలల క్రితం అనంతపురంలో ఐదు రోజుల పాటు మకాం వేసినట్లు జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) విచారణలో తేలడంతో జిల్లా పోలీసులు అలర్ట్ అయ్యారు. మూడో పట్టణ పోలీసులు స్థానిక ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని లాడ్జీలన్నీ జల్లెడ పట్టారు. కర్ణాటక నుంచి సామగ్రిని తెచ్చుకోవడానికి ఐదు రోజుల పాటు అనంతపురంలోని ఓ లాడ్జీలో మకాం వేశారు. ఐదు రోజుల తర్వాత వారిని వెనక్కు పంపాలని ఏయూటీ చీఫ్ షఫీ ఆర్మర్ ఆదేశించడంతో తిరిగి హైదరాబాద్‌కు వెళ్లినట్లు ఎన్‌ఐఏకు పట్టుబడిన ఉగ్రవాదులు విచారణలో వెల్లడించారు. దీంతో జిల్లా పోలీసులు ఒక్కసారిగా కలవరపాటుకు గురయ్యారు. ఐదు రోజులు ఉగ్రవాదులు లాడ్జీలో తిష్టవేసినా సమాచారం లేకపోవడం నిఘా వర్గాల వైఫల్యంగా భావిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here