అనంతపురంజిల్లా నిరుద్యోగులకు శుభవార్త

ఆంధ్రప్రదేశ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అకాడమీ(ఏపీఐటీఏ) ఆధ్వర్యంలో లైఫ్ సైన్స్ మరియు ఫార్మసీ విద్యార్థులకు జెన్టీయూ అనంతపురం క్యాంపస్ లో జనవరి 8న జాబ్ మేళా నిర్వహిస్తుంది. ఏపీఐటీఏ ఫైకేర్ సంస్థ ఈ రెండు రంగాలకు చెందిన విద్యార్థులకు 200 ఉద్యోగాలను కల్పించనుంది. ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ చొరవతో విద్యార్థులకు ఉపాధి అవకాశాలు పెంపొదించే దిశగా ఈ జాబ్ మేళా నిర్వహించబడుతోంది. 2010 – 2018 సంవత్సరాల మధ్యలో ఉత్తీర్ణులైన లైఫ్ సైన్స్ మరియు ఫార్మసీ విద్యార్ధులందరూ ఈ జాబ్ మేళా ప్రవేశానికి అర్హులు. అభ్యర్థులు ఇంటర్యూ జరిగే స్థలంలో ఉదయం 10.30 నిమిషాల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు ముందుగా తమ పేర్లను నమోదు చేసుకోవలెను. మైక్రో బయాలజీ, బయోటెక్నాలజీ, బయో కెమిస్టీ, డీఫార్మసీ, బీఫార్మసీ, ఎమ్ ఫార్మసీ, బీపీటీ, ఎంపీటీ, బీహెచ్ఎంఎస్, బీఏఎంఎస్, ఫార్మా-డి చెందిన విద్యార్థులు ఈ జాబ్ మేళాకు అర్హులు.

సంప్రదించాల్సిన నెంబర్ : కిషోర్ -09989930780

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *