’అదిత్య 369‘కి బాలయ్యకు పారితోషికం ఎంతో తెలుసా?

349

IMG_0018 - Copy (3)

నందమూరి బాలకృష్ణ, మోహినీ జంటగా నటించిన చిత్రం ‘ఆదిత్య 369’సినిమా విడుదలయ్యి నేటికి 25 ఏళ్లు. ఈ చిత్రం 1991 జులై 18న రిలీజైంది. సింగీతం శ్రీనివాసరావు డైరెక్షన్లో శ్రీదేవీ మూవీస్ బ్యానర్ పై శివలెంక కృష్ణప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం అప్పట్లో కోటీ యాభైరెండు లక్షలతో నిర్మించాడు. ఇదే చిత్రాన్ని ఇప్పట్లో నిర్మించాలంటే కనీసం రూ.50-60 కోట్లు అవుతుందంటున్నాడు నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్. ఈ చిత్రం విడుదలై నేటికి సిల్వర్ జూబ్లీ జరుపుకొటున్న సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘‘గాయకుడు బాలసుబ్రమణ్యం చొరవతో ఈ చిత్రాన్ని తెరకెక్కించా. మొత్తం నూట పది రోజుల్లో ఈ చిత్రాన్ని తెరకెక్కించాం. కాలంతో ప్రయాణంచే ఈ సినిమాను అప్పట్లో చింరంజీవి, విజయశాంతి కూడా ప్రమోట్ చేశారు. ఈ చిత్రం వందరోజుల ఫంక్షన్ కు చిరంజీవినే చీఫ్ గెస్ట్ గా పిలవాలనుకున్నాం. అయితే ఆయన ఫారిన్ లో వుండటం వల్ల రాలేకపోయారు. విజయశాంతి ముఖ్య అతిథిగా విచ్చేసి.. షీల్డులు అందించారు. ఈ చిత్రానికి బాలకృష్ణకు రూ.10 లక్షలు రెమ్యునరేషన్ ఇచ్చా. ఆ తరువాత ఆయనతో వంశానికొక్కుడు చేశా. ఆ చిత్రాానికి రూ.25 లక్షలు ఇచ్చా. ఆ తరువాత భలేవాడివి బాసూ చిత్రానికి రూ.కోటి ఇచ్చా. మిత్రుడు సినిమాకి రూ.3 కోట్లు ఇచ్చా’ అన్నాడు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here