అగ్రిగోల్డ్‌ కేసు విచారణ మరో కీలక మలుపు

106

అగ్రిగోల్డ్‌ కేసు విచారణ సందర్భంగా హాయ్‌ల్యాండ్‌ ఆస్తి తమది కాదని అగ్రిగోల్డ్‌ సంస్థ హైకోర్టుకు తెలిపింది. అగ్రిగోల్డ్‌కు, తమకు సంబంధం లేదని హాయ్‌ల్యాండ్‌ కోర్టుకు వెల్లడించింది. దీంతో విచారణలో ఇన్నాళ్లు ఈ విషయం ఎందుకు చెప్పలేదని అగ్రిగోల్డ్‌ సంస్థపై ఉన్నత న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. హాయ్‌ల్యాండ్‌ తమది కాదని అఫిడవిట్‌ దాఖలు చేయాలని అగ్రిగోల్డ్‌ను ఆదేశించింది. హాయ్‌ల్యాండ్‌ ఎండీ వెంకటేశ్వరరావుపై విచారణ జరపాలని సీఐడీని ఆదేశించింది. అగ్రిగోల్డ్‌ వ్యవహారంలో సీఐడీ చేపడుతున్న విచారణపై కోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. సిట్‌ ఏర్పాటు చేసి దర్యాప్తును తాము పర్యవేక్షిస్తామని హైకోర్టు వ్యాఖ్యానించింది. అగ్రిగోల్డ్‌ ఆస్తుల వివరాలను జిల్లాల వారీగా సమర్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here